అక్టోబర్ 11న తమిళనాడులో కవరైపెట్టై రైల్వేస్టేషన్ దగ్గర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిది. మైసూరు -దర్భంగా ఎక్స్‌ప్రెస్ (Mysore-Darbhanga Express) గూడ్స్ రైలును ఢీకోనడంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోంది. అక్టోబర్ 16,17 తేదీల్లో భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై చెన్నైలో రైల్వే అధికారులు దర్యాప్తు చేయనున్నారని రైల్వేశాఖ కూడా ప్రకటించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఏదైనా సమాచారం ఉంటే ప్రజలు వెంటనే తమను సంప్రదించాలని దక్షిణ రైల్వే సోషల్ మీడియా వేదికగా కోరింది.
Also Read: ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారాలు.. ఏం చేశారంటే ?
కుట్రకోణం ఉందా ?
ప్రస్తుతం ఈ రైలు ప్రమాదంపై అధికారులు భిన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమా లేదా సిగ్నలింగ్ వైఫల్యమా అనేదానిపై విచారణ జరుగుతోంది. అలాగే ఈ ప్రమాదం వెనుక ఏదైన కుట్రకోణం దాగుందా అని కూడా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరి వద్ద అయినా కూడా ఏమైన ఆధారాలు ఉంటే వాటితో విచారణకు రావాలని కోరారు.
Also Read: ఎన్నికల వేళ షిండే సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకనుంచి నో టోల్ ఫీజు!
పట్టాలు తప్పిన 13 కోచ్‌లు
ఇదిలాఉండగా.. మైసూరు నుంచి తమిళనాడు, ఏపీ, తెలంగాణ మీదుగా బీహార్‌లోని దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్ (12578) రైలు శుక్రవారం గూడ్స్ రైలును ఢీకొంది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో 13 కోచ్‌లు పట్టాలు తప్పిపోయాయి. కొన్ని చెల్లాచెదురుగా పడగా.. మరికొన్ని ఒకదానిపైకి మరొకటి ఎక్కాయి. ఈ క్రమంలోనే ఈ ప్రమాదంపై స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు తిరువళ్లూరు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలుసుకునేందుకు ఎన్‌ఐఏ సహా వివిధ ఏజెన్సీ టీమ్‌లు విచారణ చేస్తున్నాయి.
Also Read: తాకితే నరికేయండి.. అమ్మాయిలకు కత్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే