PM-KISAN: పీఎం కిసాన్‌ పథకంలో కొత్తగా ఎంతమంది లబ్ధిదారులు చేరారంటే..

పీఎం కిసాన్‌ సమ్మన్‌ నిధి పథకంలో కొత్తగా 90 లక్షల మంది లబ్ధిదారులు చేరారని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో భాగంగా గత మూడున్నర నెలల్లో కొత్తగా ఈ లబ్ధిదారులు చేరినట్లు పేర్కొంది.

PM-KISAN: పీఎం కిసాన్‌ పథకంలో కొత్తగా ఎంతమంది లబ్ధిదారులు చేరారంటే..
New Update

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో కొత్తగా 90 లక్షల మంది లబ్ధిదారులు చేరారని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో భాగంగా గత మూడున్నర నెలల్లో కొత్తగా ఈ లబ్ధిదారులు చేరినట్లు పేర్కొంది. అయితే గత ఏడాది నవంబర్‌ 15న కేంద్ర ప్రభుత్వం వికసిత్‌ భారత్‌ సంకల్ప్ యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రలో భాగంగా 2.60 లక్షల గ్రామ పంచాయతీల పరిధిలో 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు చేరినట్లు వెల్లడించింది.

Also read:  ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులే: సుప్రీంకోర్టు

ఇదిలా ఉండగా.. 2019లో ఫిబ్రవరి 2న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ పథకాన్ని ప్రారంభించింది. ప్రతీ ఏడాది మూడు విడతల్లో రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమచేస్తున్నారు. ఈ నెల 16వ తేదీన ప్రధాని మోదీ నిధులను విడుదల చేశారు. దాదాపు 11 కోట్ల మంది ఖాతాల్లో పీఎం కిసాన్‌ నగదు జమైంది. అయితే ఈ స్కీమ్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా రూ.3 లక్షల కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఈ స్కీమ్‌కు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించిన సర్వేలో కీలక విషయాలను వెల్లడించింది. యూపీలో అత్యధిక సంఖ్యలో రైతులు పీఎ కిసాన్‌ పథకం ద్వారా రైతులు లబ్ధి పొందుతున్నట్లు పేర్కొంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా నగదును అందుకున్నట్లు తెలిపింది. ఈ పథకం ద్వారా వచ్చిన మొత్తాన్ని వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కోసం ఉపయోగించినట్లు పేర్కొంది. అయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏవైన వినతులు ఉంటే పోర్టల్‌లో ఫిర్యాదు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ తెలిపింది. మరో విషయం ఏటంటే కిసాన్‌ ఇ-మిత్ర అనే పేరుతో వాయిస్‌ ఆధారిత అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ చాట్‌బోట్‌ను కూడా కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది.

Also read:  ఎయిర్‌పోర్టులో వీల్‌చైర్‌ లేక వృద్ధుడు మృతి.. ఎయిర్‌ ఇండియాకు భారీ జరిమానా

#pm-kisan-nidhi-yojana #telugu-news #national-news #pm-modi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి