Maoists Died : ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భీకర కాల్పులు(Fierce Firing) చోటుచేసుకున్నాయి. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చీపురుబట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతబలగాలకు, మావోయిస్టులు ఎదురయ్యారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. అవతలివైపు నుంచి కాల్పులు రావడం ఆగిపోవడంతో.. భద్రత బలగాలు వెళ్లి పరిశీలించగా వారికి ఆరుగురి మృతదేహాలు కనిపించాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు.
Also Read : మళ్లీ వైసీపీలోకి అంబటి రాయుడు! ట్వీట్ వైరల్..
అలాగే ఘటనాస్థలంలో మావోయిస్టు(Maoists) లకు సంబంధించిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు దొరికాయి. వాటిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ప్రస్తుతం అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇదిలాఉండగా.. బీజాపుర్ జిల్లాలోని బస్తర్ అనే ప్రాంతం లోక్‌సభ(Lok Sabha) నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ స్థానానికి ఏప్రిల్ 19న మొదటి విడతలోనే ఎన్నికలు(Elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా యాంటీ-నక్సల్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు, మాయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి.
Also Read : రైలులో మంటలు.. బయటకు దూకేసిన ప్రయాణికులు