Jammu Kashmir Terror Attack: జమ్మూకశ్మీర్‌లో రియాసి (Reasi) జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మురం చేశారు. ఈ దాడికి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిపై విచారణ జరుపుతున్నారు. ఇదిలాఉండగా.. రియాసిలో శివ్‌ఖోరీ ఆలయం నుంచి మాతా వైష్ణవిదేవి గుడికి బయల్దేరిన బస్సుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ విషాద ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఈ వాహనంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీకి చెందిన యాత్రికులు ఉన్నారు.
Also Read: అయోధ్యలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. కారణం అదేనా !
ఈ నేపథ్యంలో ఉగ్రదాడిపై ప్రధాని మోదీ (PM Modi) ఉన్నత స్థాయి సమీక్ష ఈరోజు సమావేశం నిర్వహించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో వీటిని ఎదుర్కొనేందుకు చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో వెంటనే భద్రతా బలగాలను మోహరింపజేయాలని జాతీయ భద్రతా సలహాదారు, ఇతర ఉన్నతాధికారులను ఆదేశించారు.
Also Read: కరోనా తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథుని 4 ద్వారాలు !