Memory Booster Foods: మన ఆహారపు అలవాట్లే మన జీవితంపై అత్యంత ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే రెగ్యులర్ గా మనం ఆహారం విషయంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా జంక్ ఫుడ్స్ తో లేనిపోనీ అనారోగ్యసమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. అయితే .. మంచి ఆహారం తీసుకోవడానికి ధనవంతులే కానవసరం లేదు అన్న విషయాన్నీ మరచిపోతూ ఉంటాం. మనం రెగ్యులర్ గా తీసుకునే డైట్ లో అదే ఖర్చుతో కొన్ని ఆహార పదార్థాలు చేర్చితే మనకు పోషకాలతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంద.
చేపలతో జ్ఞాపకశక్తికి పదును
చేపలు (fish) అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. ముల్లులు ఉంటాయని మాటే కానీ .. పిల్లలు సైతం చాలా ఇష్టంగా తింటారు. చేపలను తినేవారి మెదడు చాలా షార్ప్ గా ఉంటుంది, ఎందుకంటే చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మన మెదడు మరియు జ్ఞాపకశక్తిని పదును పెట్టడంలో సహాయపడతాయి.అందుకే వారంలో కనీసం రెండు సార్లయినా చేపలు తినే ప్లాన్ చేసుకోండి. చేపలతో స్నాక్ కూడా చెయ్యొచ్చు. ఇవి పిల్లలు ఇష్టంగా తింటారు. ఎదిగే పిల్లలకు చేపలు మంచి జ్ఞాపక శక్తినిస్తాయి .
పోషకాల నిలయం బ్రకోలీ
బ్రకోలీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చూడటానికి క్యాబేజి లా కనిపించే బ్రకోలీ(Broccoli)లో ఉండే యాంటీఆక్సిడెంట్లు , విటమిన్లు మెదడు పనితీరును ఆరోగ్యంగా ఉంచడంలో, జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో మేలు చేస్తాయి. అందువల్ల, మీరు మార్కెట్‌కి వెళ్లినప్పుడల్లా, ఖచ్చితంగా బ్రకోలీని తీసుకురండి.
గుమ్మడి గింజలతో ఎన్నో ప్రయోజనాలు
చాలా మంది గుమ్మడికాయలు తినడానికి ఇష్టపడరు. ఇప్పటికీ పల్లెటూళ్లలో గుమ్మడికాయతో కూర చేస్తూ ఉంటారు, అయితే .. గుమ్మడిలో ఉండే గింజలు ఎవరూ తినరు.కానీ .. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. గుమ్మడికాయ గింజలు(Pumpkin seeds)మీ జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఇందులో అనేక పోషకాలు లభిస్తాయి. అదనంగా, ఇది హై బీపీని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని పెంచడంలో గుమ్మడి గింజలు బాగా పని చేస్తాయి.
చాక్లెట్స్ మేలు
పిల్లలు చాక్లెట్స్ ఎక్కువగా తింటూ ఉంటె మనం కోప్పడతాం. కానీ నాణ్యమైన చాక్లెట్ తింటే చాలా ఉపయోగం. ప్రతిరోజూ ఒక డార్క్ చాక్లెట్(Dark chocolate)తినడంవల్ల వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లతో పాటు , అనేక ఇతర పోషకాలు మన జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. అందుకే చిన్నపిల్లలు చాలా హుషారుగా ఉంటారు.
వాల్‌నట్‌లు, బాదంపప్పులతో మెమరీ పవర్
మెదడుకు పదును పెట్టడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి(Walnuts, almonds)వాల్‌నట్‌లు, బాదంపప్పులను తినాలి. తరచుగా ఎవరైనా ఏదైనా మరచిపోయినప్పుడు, బాదంపప్పు తినమని ఇచ్చే మొదటి సలహా, మనస్సు పదునుగా మారుతుంది. కాబట్టి ఈ రోజు నుండే బాదం తినడం ప్రారంభించండి.
ALSO READ: CRPF కానిస్టేబుల్ (GD) రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ విడుదల