Yemen: యెమెన్‌లో విషాదం..పదవబోల్తాపడి 49 మంది మృతి

యెమెన్ దగ్గరలో అత్యత విషాదం చోటు చేసుకుంది. రెఫ్యూజీలతో వెళుతున్న పడవ బోల్తాపడి 49మంది ఒకేసారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరో 140 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Yemen: యెమెన్‌లో విషాదం..పదవబోల్తాపడి 49 మంది మృతి

49 died At Boat Accident: 260మంది సోమాలియాలు, ఇథియోపిన్లతో గల్ఫ్ ఆఫ్ అడెన్‌ మీదుగా సముద్రంలో వెళుతున్న పడవ యెమెన్ దగ్గర హఠాత్తుగా బోల్తా పడిపోయింది. దీంతో అక్కడిక్కడే 49 మంది మృతి చెందారు. మరో 140 మంది గల్లంతయ్యారు. సెర్చ ఆపరేషన్ ద్వారా 71 మందిని రక్షించారు. మిగతా వారి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.

ఆఫ్రికాలో పేదరికం నుంచి తప్పించుకోవడానికి గల్ఫ్ దేశాలకు ఎంతో మంది వలస వెళుతుంటారు. వీళ్ళందరూ ఖర్చు తక్కువ కారణంగా పడవల్లోనే ప్రయాణాలు చేస్తుంటారు. చాలా రిస్క్ అని తెల్సిన పేదరికంతో చేస్తారు. ఆఫ్రికా నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళాలంటే యెమెన్ మీదుగానే వెళ్ళాలి. సులువైన, దగ్గర మార్గాల్లో ఇదొకటి.

Also Read:Pakistan: ఇంటర్వ్యూ చేసిన పాపానికి ప్రాణం పోగొట్టుకున్నయూట్యూబర్

Advertisment
తాజా కథనాలు