Maoists : పోలీసులకు లొంగిపోయిన 33 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో 33 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు కీలక నేతలు కూడా ఉన్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. By B Aravind 25 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Maoists Surrender To Police : లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల వరుసగా పోలీసులు (Police), మావోయిస్టుల (Maoists) మధ్య కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో 33 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ విషయాన్ని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలిపారు. అలాగే వీళ్లపై రూ.5 లక్షల రివార్డ్ ఉందని పేర్కొన్నారు. Also read: భారీ వర్షాలు.. 11 మంది మృతి ఇదిలాఉండగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ పోలీసులు.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వరుసగా ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ కాల్పుల్లో దాదాపు 50 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరు పోలీసులకు లొంగిపోయారు. అయితే తాజాగా మరో 33 మంది మావోయిస్టులు లొంగిపోయారు. శనివారం ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక జూన్ 1 నాటికి ఎన్నికలు (Elections) పూర్తవుతాయి. జూన్ 4న కౌంటింగ్ ఉండనుంది. Also Read: ఇది సినిమా కాదు రియల్.. ఇలాంటి గ్యాంగ్ వార్ ఎక్కడా చూసి ఉండరు.. #telugu-news #national-news #maoists #chattisgarh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి