Israel-Hamas War: సరిహద్దులో ఇజ్రాయెల్ సేనలు-గాజాలో ఉద్రిక్త వాతావరణం

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం పదోరోజుకు చేరుకుంది. ఇప్పటికే అల్లకల్లోలంగా ఉన్న గాజా పరిస్థితి మరింత దారుణంగా మారబోతోందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకరి మీద ఒకరు విమానాలు, క్షిపణులతో దాడులు చేసుకుంటున్నారు. దీనికి తోడు 3 లక్షలకు పైగా సైన్యంతో గాజాను చుట్టుముట్టడానికి ఇజ్రాయెల్ రెడీగా ఉంది. ప్రభుత్వ ఆదేశాల కోసం వారు ఎదురుచూస్తున్నారు.

Israel-Hamas War: సరిహద్దులో ఇజ్రాయెల్ సేనలు-గాజాలో ఉద్రిక్త వాతావరణం
New Update

Israel-Hamas War: పశ్చిమాసియా అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో ఆ రెండు ప్రాంతాలే కాక లెబనాన్, ఇరాన్ (Iran) లలో కూడా యద్ధవాతావరణం నెలకొంది. గాజా (Gaza) సరిహద్దుల్లో బలగాలను మొహరించి ఇజ్రాయెల్ రెడీగా ఉంది. 3,60,00మంది ఇజ్రాయెల్ రిజర్విస్ట్‌లు గాజాలో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు గాజా నంచి హమాస్ రాకెట్లను ప్రయోగిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ గాజాలో భూదాడులకు దిగితే తాము యుద్ధంలోకి వస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. గాజాలో ప్రజలంతా ఇళ్ళు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ఇంకా వెళ్ళాల్సిన వారు చాలా మందే ఉన్నారు. గాజాలో ఇప్పటికే చాలా హమాస్ స్థావరాను నేలమట్టం చేశామని ఇజ్రాయెల్ చెబుతోంది. దాంతో మిలిటెంట్ కమాండర్లను హతమార్చామని అంటోంది. ఏమైనా, ఎంత మంది చనిపోయినా తాము మాత్రం వెనక్కి తగ్గేదే లేదు అంటోంది హమాస్.

ఇజ్రాయెల్ (Israel) , హమాస్ (Hamas) దాడుల్లో ఇప్పటిదాకా గాజాలో 2,750 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మరో 79,700 మంది గాయపడ్డారని ఆరోగ్య శాఖ ప్రకటించింది. బాధితుల హాహాకారాలతో అక్కడి ఆసుపత్రులు మారుమోగుతున్నాయి. ఇక హమాస్ దాడుల్లో 1400 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. ఉత్తర గాజా నుంచి ఇప్పటిదాకా 6 లక్షల మంది దక్షిణ గాజాకు తరలివెళ్ళారు. ఇంకా నాలుగు లక్షల మంది వెళ్ళాల్సి ఉంది. గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకర్లను మోహరించింది. దాంతో పాటూ అమెరికా పంపిన అత్యాధునిక యుద్ధ విమాన నౌక మధ్యధరా సముద్రంలో గాజాకు సమీపంలో ఉంది. గాజాలో ఉన్న హమాస్ ను సమూలంగా నాశనం చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది.

Also Read:సుప్రీంలో చంద్రబాబుకు ఊరట లభించేనా?

గాజాలో హమాస్ చేతుల్లో 199 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్నారు. ఇందులో సైనికులు, మహిళలు , చిన్నారులు ఉన్నారు. అయితే గాజా స్ట్రిప్ మీద దాడులు ఆపేస్తే బందీలను విడుదల చేయడానికి హమాస్ సిద్ధంగా ఉందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. కానీ హమాస్ నుంచి మాత్రం ఎటువంటి స్పందనా రాలేదు. దాని ఆలోచన వేరేగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్  ఖైదుల్లో బందీలుగా ఉన్ పాలస్తీనా ఖైదీలను విడిచిపెడితే తమ దగ్గర ఉన్న బందీలను విడుదల చేస్తామని మొదటి నుంచి హమాస్ చెబుతోంది.

ఐక్యరాజ్యసమితి (UN), అమెరికా అధ్మక్షుడు జో బైడెన్ (Joe Biden) తో సహా అందరూ యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నారు. కానీ...ఇజ్రాయెల్, మహాస్ రెండూ మాత్రం ఎవరి మాటా వినడం లేదు. పక్కనుంచి ఇరాన్ హెచ్చరిస్తున్నా ఇజ్రాయెల్ పెడ చెవిన పెడుతోంది. అలాగే వేల మంది పాలస్తీనియన్లు చనిపోతున్నా హమాస్ కూడా తమ దాడులను ఆపడం లేదు. తమ దేశ సరిహద్దుల్లో తమన పరీక్షించొద్దని ఇరాన్, హెజ్బుల్లా సంస్థలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. హమాస్ ను నాశనం చేయడానికి ప్రపంచ దేశాలు తమతో చేతులు కలపాలని ఆయన కోరారు. హమాస్ మిలిటెంట్లు నాజీ ముష్కరులు లాంటివారేనని నెతన్యాహు వ్యాఖ్యలు చేశారు.

వచ్చే వారం ఇజ్రాయెల్ కు బైడెన్...

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ బుధవారంనాడు ఇజ్రెయెల్ కు వెళతారని యూఎస్ స్టేట్ సెక్రటరీ బ్లింకిన్ (Blinken) చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Netanyahu) తో బైడెన్ యుద్ధ పరిస్థితుల మీద చర్చించనున్నారు. ఇజ్రాయెల్ కు తమ సపోర్ట్ కొనసాగుతుందని బ్లింకిన్ స్పష్టం చేశారు.

#israel-hamas-war #gaza #hamas #israel
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe