Telangana : ఇంకా తేలని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలైపోయింది. కానీ ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది మాత్రం ఇంకా తేలడం లేదు. అదొక్కటే కాదు మొత్తంగా కాంగ్రెస్‌ను మూడు సీట్లు కలవరపెడుతున్నాయి. ఎవరికి ఇవ్వాలో తెలీని పరిస్థితి నెలకొంది.

New Update
Telangana : ఇంకా తేలని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి

Telangana Congress : తెలంగాణ లోక్‌సభ ఎంపీ స్థానాల్లో మూడింటిని ఎవరికి ఇవ్వాలో తెలీక కాంగ్రెస్(Congress) మల్లగుల్లాలు పడుతోంది. అధిష్టానం దగ్గర నుంచి లోకల్ నాయకులు వరకు ఎటూ తేల్చుకోలని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ సీట్ల మీద ఇప్పటికే అధిష్టానం చాలాసార్లు కసరత్తులు చేసింది కానీ ఎవరికి ఇవ్వాలో మాత్రం నిర్ణయించలేకపోయింది. ముఖ్యంగా ఖమ్మం(Khammam) ఎంపీ టికెట్ సమస్య కాంగ్రెస్‌ను తినేస్తోంది. దీంతో పాటూ కరీంనగర్, హైదరాబాద్ స్థానాలు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి.

ఖమ్మం టికెట్‌ కోసం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. తమవారికే సీటు ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి, పొంగులేటి, తుమ్మల పట్టుపట్టుకుఏని కూర్చున్నారు. ఈ నేపథ్యంలో తెరపైకి మండవ వెంకటేశ్వరరావు, రఘురామిరెడ్డి పేర్లు వచ్చాయి. వారికే సీటు ఇచ్చేస్తున్నారని ప్రచారం కూడా జరిగింది కానీ ప్రకటన మాత్రం చేయలేదు. అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్‌ నాయకులు ఎవ్వరూ రాజీకి రావడం లేదు. ఈ భిన్నాభిప్రాయాలు మధ్య ఎంపీ సీటు ప్రకటన ఆలస్యం అవుతోంది.

మరోవైపు కరీంనగర్, హైదరాబాద్‌లో కూడా ఇదే పరిస్థి ఉంది ఇంచుమించుగా. ఇప్పటికే నోటిఫికేషన్ల ప్రక్రియ మొదలైపోయింది. మరో 5, 6 రోజుల్లో ఇది ముగుస్తుంది కూడా. దాంతో పాటూ కరీంనగర్‌(Karimnagar) లో మిగతా పార్టీల అభ్యర్థులు అయిన బండి సంజయ్, వినోద్‌లు తమ ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఇప్పటివరకు అభ్యర్థి ఎవరో తెలియకపోవడంతో ఆ ఊసే లేకుండా పోయింది. హైదరాబాద్‌లో కూడా ఇదే సిట్యువేషన్. హైదరాబాద్‌లో హిందూ అభ్యర్ధిని నిలబెట్టాలా? లేక ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆ కమ్యునిటీ అభ్యర్థిని నిలబెట్టాలా అని ఆలోచిస్తోంది అధిష్టానం. కానీ ఇలా ఆలోచిస్తుంటే పుణ్య కాంల కాస్తా గడిచిపోతుందని... నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం ఎవరూ అలగకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలని చూస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో చీలికలు రాకుండా ఉండాలని భావిస్తోంది.

Also Read:Andhra Pradesh: సీఎం జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్..అతనికి సంబంధం లేదు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు