ఉగ్ర రూపం దాల్చిన వరుణుడు... 24 మంది మృతి...పలువురు గల్లంతు... ! హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో భారీ వర్షాలకు 24 మంది మృతి చెందగా, పలువురు గల్లంతు అయినట్టు సీఎం సుఖ్వీందర్ సింగ్ తెలిపారు. గత రాత్రి సోలన్ జిల్టాలో క్లౌడ్ బరస్ట్ వల్ల ఏడుగురు మరణించినట్టు పేర్కొన్నారు. ఇక సిమ్లాలో శివాలయంపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. By G Ramu 14 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల వరదలు ముంచెత్తాయి. గడిచిన 24 గంటల్లో భారీ వర్షాలకు 24 మంది మృతి చెందగా, పలువురు గల్లంతు అయినట్టు సీఎం సుఖ్వీందర్ సింగ్ తెలిపారు. గత రాత్రి సోలన్ జిల్టాలో క్లౌడ్ బరస్ట్ వల్ల ఏడుగురు మరణించినట్టు పేర్కొన్నారు. మృతులను హర్నామ్(38), కమల్ కిషోర్(35), హేమలత( 34), రాహుల్ (14), నేహా(12), గోలూ( 8), రక్ష(12) గా అధికారులు గుర్తించారు. ఇక సిమ్లాలో శివాలయంపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. ఆలయ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొసాసాగుతోందని అధికారులు తెలిపారు. సిమ్లాలోని పగ్లీ ప్రాంతంలోనూ కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఆరుగురు గాయపడగా, ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు వివరించారు. మరణించిన వారిని నేపాలీ కూలీలుగా గుర్తించారు. మండి జిల్లాలో ధరమ్ పూర్ సబ్ డివిజన్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు మరణించారు. బంబోలా గ్రామంలో ఇల్లు కూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచించారు. అత్యవసరం అయితే తప్పా బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా వుండాలని సూచించారు. గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్టు ఐఎండీ పేర్కొంది. కాంగ్రాలో 273.4 మిమీల వర్షం కురిసినట్టు చెప్పారు. సుజన్ పూర్ లో 254 మిమీ, ధర్మశాల 250 మిమీ, పాలంపూర్ 220 మిమీ, గులార్ 191 మిమీ, జోగిందర్ నగర్ 178 మిమీ, నగ్రోటా సూరియన్ 175.8 మిమీ. కతౌలా 172.3 మిమీ, సుందర్ నగర్ 168.4మిమీ, బల్ద్వారా 146.9 మిమీ, మండీ 139.6 మిమీ, జబ్బర్ హట్టీ131.6, బర్తీన్ 126.2 మిమీ వర్షం పడినట్టు వెల్లడించింది. #missing #rains #temple #himachal-pradesh #landslides #24-dead #cloud-burst మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి