Kota Suicide Cases: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 28కి చేరుకున్న బలవన్మరణాల సంఖ్య..

రాజస్థాన్‌ కోటాలో తాజాగా 20 ఏళ్ల విద్యార్థి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాది ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య 28కి చేరిమంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

రాజస్థాన్‌లో కోచింగ్‌ హబ్‌ అయినా కోటాలో వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపుతోంది. వీటిని నివారించేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా బలవన్మరణాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఓ మరో విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కోటాలో ఈఏడాది ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య 28కి చేరిపోయింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఫరీద్‌ హుస్సేన్ (20) అనే విద్యార్థి కోటాలో నీట్‌ పరీక్ష కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. వక్ఫ్‌నగర్ ప్రాంతంలో ఇతర విద్యార్థులతో కలిసి ఓ గదిలో అద్దెకు ఉంటున్నాడు. అయితే సోమవారం సాయంత్రం గదిలో ఒంటిరిగా ఉన్న ఫరీద్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 7 గంటలకు అతని స్నేహుతులు రూంకు వచ్చేసరికి డోర్‌ లోపలి నుంచి లాక్ వేసి ఉంది. పరీధ్‌కు కాల్ చేస్తే ఎలాంటి స్పందన రాకపోక.. తలుపులు పగలగొట్టారు. దీంతో ఫరీద్‌ విగతజీవిగా కనిపించాడు.

Also Read: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. సీఎం కేసీఆర్ చివరి ప్రచారం ఎక్కడంటే..

ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం తరలించారు. అయితే ఫరీద్ ఆత్మహత్యపై అతని కుటంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని.. అతని మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. దీంతో ఈ ఏడాదిలో కోటాలో ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 28కి చేరింది. పరీక్షల భయం, మానసిక ఒత్తిడి వల్లే అక్కడ విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే విద్యార్థుల ఆత్మహత్యలు ఆపేందుకు కోటాలో హస్టల్స్, భవనాల చుట్టు ఇనుప వలలు, గదుల లోపల స్ప్రింగ్ కాయిల్ ఫ్యాన్లను అమర్చుతున్నారు. అయినాకూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కోటాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలోని అత్యధికంగా 28 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయని పోలీసులు పేర్కొన్నారు.

Also Read: పోలింగ్ డే రోజున ఓటర్లకు ర్యాపిడో ఉచిత సేవలు

Advertisment
Advertisment
తాజా కథనాలు