ఢిల్లీలోలని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఓ రెండేళ్ల చిన్నారి బ్రెయిన్ డెడ్ కారణంగా మృతి చెందింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రుల తమ కూతురి అవయవాలను దానం చేసి పెద్ద మనసు చాటుకున్నారు. వాళ్లు దానం చేసిన ఆ చిన్నారి అవయవాలతో ఇద్దరు పిల్లలకు పునర్జన్మనిచ్చారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. దివ్యాన్షి అనే రెండేళ్ల చిన్నారి తన ఇంటి బాల్కనిలో ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు మూడంతస్తుల భవనం నుంచి కిందపడిపోయింది. తీవ్రగాయలపాలైన ఆ చిన్నారిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె బ్రెయిన్ డెడ్‌కు గురై మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కానీ బాలిక శరీరంలోని అవయవాలు మాత్రం సక్రమంగా పనిచేస్తున్నాయని.. వాటిని అవసరాల్లో ఉన్నవారికి దానం చేయాలని వైద్యులు ఆ చిన్నారి తల్లిదండ్రుల్ని కోరారు.
Also read: స్టవ్ కావాలని నమ్మించి.. పక్కింటి యువతిపై యువకుల దారుణం
దీనికి ఆ దంపతులు ఒప్పుకొని తమ కూతురు అవయవాలను దానం చేశారు. దీంతో చైన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో గుండె సమస్యతో చికిత్స పొందుతున్న 8 నెలల పాపకు.. దివ్యాన్షి గుండెను అమర్చారు. అలాగే మరో చిన్నారికి కూడా దివ్యాన్షికి చెందిన రెండు కిడ్నీలను అమర్చనున్నట్లు వైద్యులు తెలిపారు. అలాగే ఆ చిన్నారి కళ్లను ఐ బ్యాంకులో భద్రపరిచారు. అయితే ఢిల్లీలో అతిచిన్న వయసులో అవయవ దానం చేసిన చిన్నారికి దివ్యాన్షి నిలిచిపోయిందని వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు దేశంలో చనిపోతున్న చిన్నారుల్లో చాలా మంది ఎత్తు నుంచి కిందకి పడిపోడిపోతున్న వారే ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇదిలాఉండగా.. ఈ నెల 16న నోయిడాలోని శశి(48) అనే మహిళకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ తరలించడంతో చికిత్స తీసుకుంటుండగా.. బ్రెయిన్ డెడ్ కావడంతో మృతిచెందింది. దీంతో శశి అవయవాలను కూడా దానం చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. శశి రెండు కిడ్నిల్లోని ఓ కిడ్నీని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఓ రోగికి మరోకటి ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో రోగికి వైద్యులు అమర్చారు.