Drugs Rocket: దేశంలో చాలా చోట్ల డ్రగ్స్ రాకెట్స్ గుట్టుగా నడిపిస్తున్నారు. తరుచుగా చిన్న చిన్న ముఠాలు పట్టుబడుదూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోనే అతి పెద్ద డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేశారు ఢిల్లీ పోలీసులు, ఎన్సీబీ అధికారులు. ఇందులో రెండువేల కోట్లు విలువచేసే డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ వ్యవహారం అంతటి వెనుకా తమిళ రంగానికి చెందిన ఒక సినీ నిర్మాత ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.
ఇక్కడ నుంచి విదేశాలకు...
మన దేశం నుంచి ఇతర దేశాలకు డ్రగ్స్ భారీ సరఫరా అవుతున్నాయి. సూడోపెడ్రిన్ అనే డ్రగ్‌కు మిగతా దేశాల్లో భారీ డిమాండ్ ఉంది. దీన్ని మెథాంఫేటమిన్ తయారీలో ఉపయోగిస్తారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో దీని వాడకం చాలా ఎక్కువ. అందుకే మన దేశం నుంచి ఆ దేశాలకు పెద్ద మొత్తంలో ఈ డ్రగ్ తరలివెళుతోంది. దీనిని కిలో రూ. 1.5 కోట్లకు విక్రయిస్తున్నారు. హెల్త్ మిక్స్ పౌడర్స్, కొబ్బరితో తయారు చేసే ఆహారపదార్ధాల్లో దీన్ని మిక్స్ చేసి ఎగుమతి చేస్తున్నారు. అది కూడా సముద్ర మార్గం ద్వారా వీటిని పంపిస్తున్నారు. ఈ డ్రగ్ రవాణా గురించి సమాచారం అందుకున్న ఎన్సీబీ మాఫియా కదలికల మీద నిఘా పెట్టింది. దీని వెనుక ఉన్న ముఠా గురించి ఆరాలు తీసింది.
ఇందులో భాగంగా ఎన్సీపీ ఫిబ్రవరి 15న ఢిల్లీలోని దారాపూర్ నుంచి సూడోపెడ్రిన్ డ్రగ్ తరలివెళుతున్నట్టు తెలుసుకున్నారు. వెంటనే అక్కడ ఉండే గోడౌన్స్‌లో తనిఖీలు నిర్వహించారు. దీంట్లో మొత్తం 5౦ కిలోల సూడోపెడ్రిన్ డ్రగ్ దొరికింది. అక్కడే దీనికి సంబంధించి ముగ్గురిని అరెస్ట్ కూడా చేశారు. ఈ డ్రగ్ రాకెట్‌లో ఇండియా కాకుండా మలేసియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీరి నెట్ వర్క్ భారీ స్థాయిలో విస్తరించి ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Also Read:Dhruv: మరో ధోనీ.. ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్ పై ప్రముఖుల ప్రశంసలు!