Andhra Pradesh: ఆంధ్రాలో 18 మంది ఐ.ఏ.ఎస్ అధికారులు బదిలీ..

ఆంధ్రాలో పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఈరోజు దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. మొత్తం 18మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు.

Andhra Pradesh: ఆంధ్రాలో 18 మంది ఐ.ఏ.ఎస్ అధికారులు బదిలీ..
New Update

IAS Transferred in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చాక చాలా మార్పులు జరుగుతున్నాయి. పలు కీలకశాఖల్లో కొత్త అధికారులను నియమించిన గవర్నమెంట్ తాజాగా ఇప్పటివరకు పనిచేసిన ఐఏఎస్ అధికారులను బదిలీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. మొత్తం 18మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్ తెలిపారు.

గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.నాగలక్ష్మి
ప్రస్తుతం గుంటూరు కలెక్టర్‌గా ఉన్న వేణుగోపాల్‌రెడ్డి జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
విశాఖ జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వులు
విశాఖ జేసీకి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు
ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె.వెట్రిసెల్వి నియామకం
అల్లూరి జిల్లా కలెక్టర్‌ ఎం.విజయసునీత బదిలీ
అల్లూరి కలెక్టర్‌గా దినేష్‌కుమార్‌ నియామకం
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి
విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బి.ఆర్‌.అంబేడ్కర్‌
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా సి.నాగరాణి
చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా సుమిత్‌కుమార్‌
కాకినాడ జిల్లా కలెక్టర్‌గా సగలి షణ్మోహన్‌
ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా జి.సృజన
ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా తమీమ్‌ అన్సారియా
కర్నూలు జిల్లా కలెక్టర్‌గా రంజిత్‌ బాషా
బాపట్ల కలెక్టర్‌గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు

IAS Transferred in AP publive-image

Also Read:Weather: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో హీట్ వేవ్..ఐఎండీ హెచ్చరిక

#andhra-pradesh #government #ias #transfer
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe