Israel-Iran Row: ఇరాన్‌ చేతికి చిక్కిన వాణిజ్య నౌక.. అందులో 17 మంది భారతీయులే

ఇజ్రాయెల్‌ - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. తాజాగా హార్మూజ్ జలసంధిలో పోర్చగీసు జెండాలతో, ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న ఓ వాణిజ్య నౌకను ఇరాన్‌ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నౌకలో 25 మంది ఉండగా అందులో 17 మంది భారతీయులే కావడం ఆందోళన కలిగిస్తోంది.

Israel-Iran Row: ఇరాన్‌ చేతికి చిక్కిన వాణిజ్య నౌక.. అందులో 17 మంది భారతీయులే
New Update

ఇజ్రాయెల్‌ - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. తాజాగా హార్మూజ్ జలసంధిలో పోర్చగీసు జెండాలతో, ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న ఓ వాణిజ్య నౌకను ఇరాన్‌ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నౌకలో 25 మంది ఉండగా.. అందులో 17 మంది భారతీయులే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే వారిని విడుదల చేసేందుకు.. భారత్ ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై ఇజ్రాయెల్ కూడా స్పందించింది. వివాదాన్ని తీవ్రతరం చేయడం వల్ల ఇరాన్‌ తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

Also Read: సరోగసీపై ఇటలీ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు..

హెలికాప్టర్ సాయంతో నౌకను వెంబడించి.. ప్రత్యేక బలగాలు ఆ వాణిజ్య నౌకను నియంత్రణలోకి తీసుకన్నట్లు టెహ్రాన్ మీడియా పేర్కొంది. ప్రస్తుతం ఆ నౌకను ఇరాన్‌ ప్రాదెశిక జలాల వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నౌక ఇజ్రెయ్‌ కుబేరుడైన ఇయాల్‌ ఓఫర్‌ జోడియస్‌గా సంస్థకు చెందిన ఎంఎస్‌సీ ఏరిస్‌గా భావిస్తున్నారు. ఇదిలాఉండగా కొద్దిరోజుల క్రితమే ఇరాన్ రాయబార కార్యలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పలువురు కీలక సైనికాధికారులు మరణించారు.

ఇజ్రాయెలే ఈ దాడికి పాల్పడిందని ఇరాన్‌ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇందుకు ప్రతిదాడులు తప్పవని హెచ్చరించింది. అంతేకాదు ఈ విషయంలో అమెరికా కూడా జోక్యం చేసుకోవద్దని కోరింది. మరోవైపు ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణంపై అమెరికా ఆందోళ వ్యక్తం చేస్తోంది. పరిస్థితులు తీవ్రతరమైతే.. ఇజ్రాయెల్ - హమాస్‌ వరకే పరిమితమైన ఈ యుద్ధం.. పశ్చిమాసియాకు విస్తరించే ఛాన్స్ ఉందని చెబుతోంది.


Also Read: మేఘా కృష్ణారెడ్డికి షాక్.. సీబీఐ కేసు నమోదు

#telugu-news #israel #ship #iran #israel-iran
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe