Bangladesh: బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న 17 మంది కార్మికులు.. చివరికి

బంగ్లాదేశ్‌లో అల్లర్లు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ రహదారి పనులు చేస్తున్న 17 మంది భారత కార్మికులు చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వాళ్లని స్వదేశానికి తీసుకొచ్చేందుకు బీఎస్‌ఎఫ్ రంగంలోకి దిగింది. త్రిపురలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా వాళ్లని సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చింది.

New Update
Bangladesh: బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న 17 మంది కార్మికులు.. చివరికి

బంగ్లాదేశ్‌లో ఇంకా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న 17 మంది భారత కార్మికులను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF) స్వదేశానికి తీసుకొచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్‌లోని అకౌరా నుంచి కిశోర్‌గంజ్‌ వరకు 52 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారిని నిర్మించేందుకు చేపట్టిన ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే ఇందులో 17 మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఈ సమయంలోనే బంగ్లాదేశ్‌లో నిరసనలు చెలరేగాయి. దీంతో పరిస్థితులు చేజారడంతో వాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం అక్కడే శిబిరంలో తల దాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్‌కు తీసుకొచ్చేందుకు బీఎస్‌ఎఫ్ రంగంలోకి దిగింది. త్రిపురలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా వాళ్లని సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చింది.

Also Read: మరోసారి బయటపడ్డ మేఘా నిర్వాకం.. కుప్పకూలిన ప్రహారీ గోడ

Advertisment
Advertisment
తాజా కథనాలు