Schools: ఆ రాష్ట్రంలో 1600 స్కూళ్ల మూసివేత‌..

ఉత్తరఖాండ్‌లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ రాష్ట్రంలో 1671 స్కూళ్లు మూసివేసినట్లు అక్కడి విద్యాశాఖ తెలిపింది. అలాగే 3,573 ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరిక తగ్గిపోయిందని.. ఆ పాఠశాలలో పది లేదా అంతకన్న తక్కువ విద్యార్థులు చేరారని పేర్కొంది.

New Update
Schools: ఆ రాష్ట్రంలో 1600 స్కూళ్ల మూసివేత‌..

Schools:  ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో ప్రభుత్వ సూళ్లను మూసే ప్రక్రియన కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 1671 స్కూళ్లు మూసివేసినట్లు అక్కడి విద్యాశాఖ తెలిపింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు అధికారులు తెలిపారు. అలాగే 3,573 ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరిక తగ్గిపోయిందని.. ఆ పాఠశాలలో పది లేదా అంతకన్న తక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరారని ఉత్తరఖాండ్‌ సర్కార్ తెలిపింది.

Also Read: రాజ్యాంగాన్ని మార్చాలన్న ఎంపీని మార్చిన బీజేపీ

అలాగే 102 పాఠశాలలో కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పౌరి అనే జిల్లాలో అత్యధికంగా 315 ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. ఇక ఉద్దమ్‌ సింగ్ నగర్ అనే జిల్లాలో కేవలం 21 స్కూళ్లను మూసివేశారు. దీన్నిబట్టి చూస్తే.. ఉత్తరఖాండ్‌లు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే మూసివేసిన స్కూళ్ల స్థానంలో ఆ భవనాలను.. అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే హోమ్‌ స్పేస్‌, గ్రామ పంచాయతీ హాల్స్‌గా కూడా వాడనున్నారు.

అయితే ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలని భావిస్తోంది. తమ రాష్ట్రంలో ఫిన్‌లాండ్ విద్యావిధానం అనుసరించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల ఉత్తరఖాండ్‌ విద్యాశాఖ మంత్రి.. నాలుగు రోజుల పాటు ఫిన్‌ల్యాండ్, స్వి్ట్జర్‌ల్యాండ్ దేశాల్లో పర్యటన చేశారు. ఈ నేపథ్యంలోనే ఫిన్‌ల్యాండ్‌ మోడల్‌ను తమ రాష్ట్రంలో అమలు చేయాలని భావించారు. అయితే ఫిన్‌ల్యాండ్‌ విద్యావ్యవస్థ ప్రపంచంలోనే అత్యున్నత విద్యావ్యవస్థగా పేరు పొందింది. వివిధ దేశాలకు చెందినవారు కూడా ఫిన్‌ల్యాండ్‌ విద్యావిధానాన్ని పరిశీలించి వాటిని తమ దేశాల్లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి.

Also Read: హత్య చేసేందుకు ప్రయత్నించింది మీరు కాదా.. ప్రధాని మోదీపై డీఎంకే మంత్రి విమర్శలు

Advertisment
తాజా కథనాలు