Chandipura Virus : భయపెడుతున్న చాందీపుర వైరస్.. 16 మంది మృతి

గుజరాత్‌లో చాందీపుర వైరస్ బారినపడి ఇప్పటివరకు 16 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రుషికేష్ పటేల్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వైరస్ ప్రభావం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Chandipura Virus : భయపెడుతున్న చాందీపుర వైరస్.. 16 మంది మృతి
New Update

Rushikesh Patel : గుజరాత్‌ (Gujarat) లో చాందీపుర వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు ఈ వైరస్ 50 మందికి సోకింది. 16 మంది మరణించారు.  ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రుషికేష్ పటేల్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వైరస్ ప్రభావం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ అనుమానిత వైరస్‌ కేసులు సబర్‌కాంత, ఆరావళి, మహిసాగర్‌, ఖేడా, మెహసనా, రాజ్‌ కోఠ్‌ జిల్లాల్లో (Rajkot Districts) నమోదయ్యాయి.

Also Read: భారీ వర్షాలు.. నిండుకుండలా మారిన జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు

చాందీపుర వైరస్‌ అంటే ?
చాందీపుర వైరస్‌ (Chandipura Virus) సోకిన వ్యక్తిలో జ్వరం, ఫ్లూ, మెదడువాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దోమలు, ఇతర కీటకాల నుంచి ఈ వ్యాధి సోకుతుంది. ఇది రాబ్డోవిరిడే కుటుంబానికి చెందిన వెసిక్యులోవైరస్ జాతికి చెందినదిగా వైద్య నిపుణులు గుర్తించారు.

Also read: కేదార్‌నాథ్‌లో విషాదం.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి



#telugu-news #national-news #gujarat #chandipura-virus
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe