వెనెజులాలో విషాదం చోటుచేసుకుంది. 17 వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. మరకొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదావాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. వెనెజులాలోని ఓ హైవేపై వాహనాలు ఎప్పట్లాగే వెళ్తున్నాయి. అయితే ఓ ట్రక్కు అతివేగంగా వెళ్తోంది. చివరకి అది అదుపుతప్పి పలు కార్లను ఢీకొంది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో పలు కార్లు, ఓ బస్సుతో పాటు మొత్తం 17 వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి.
Also read: ఒక్క వాట్సప్ వీడియోకాల్.. రూ.19 లక్షలు హాంఫట్!
దీంతో 16 మంది ప్రాణాలు కోల్పోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు, సహాయక సిబ్బంది హుటాహూటీనా ఘటనాస్థలానికి సహాయక చర్యలు చేపట్టారు. గాయాలపాలైనవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న మృతుల బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి.
Also read: ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆస్పత్రిలో అల్లాడిపోయిన రోగులు
నిత్యం ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడం పెను భూతంలా మారిపోయింది. అతివేగంగా ప్రయాణించడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, విచక్షణా రహితంగా డ్రైవింగ్ చేయడం ఇలాంటి ఘటనల వల్ల ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధికారులు నిందితులపై ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. కొందరి వాహనాదారుల నిర్లక్ష్యం వల్ల ఇతర వాహనాదురుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.