Republic Day 2024: గణతంత్ర దినోత్సవం.. 14 వేల మంది పోలీసులు మోహరింపు

రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్న వేళ.. ఢిల్లీలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించే కర్తవ్యపథ్‌ పరిసరాల్లో 14 వేల మంది పోలీసులు మోహరించారు. అయితే ఈ కార్యక్రమానికి దాదాపు 77 వేల మంది అతిథులు వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు చెప్పారు.

New Update
Republic Day 2024: గణతంత్ర దినోత్సవం.. 14 వేల మంది పోలీసులు మోహరింపు

జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలోని పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఇందుకోసం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించే కర్తవ్యపథ్‌ పరిసరాల్లో 14 వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. అయితే ఈ వేడుకలకు దాదాపు 77 వేల మంది అతిథులు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీని 28 జోన్లుగా విభజించామని పేర్కొన్నారు.

Also Read: అయోధ్యలో భక్తుల రద్దీ.. వారిని దర్శనానికి వెళ్ళవద్దన్న ప్రధాని మోదీ..!!

పోలీసులకు సహకరించాలి

ఈ 28 జోన్లలో పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తారని పేర్కొన్నారు. అంతేగాక హెల్ప్‌ డెస్కులు, ప్రాథమిక చికిత్స కేంద్రాలను కూడా ఏర్పాటుచేశామన్నారు. అయితే ఈ వేడుకలకు వచ్చే అతిథులు సమయానికి రావాలని.. పోలీసులందికీ సహకరించాలని అభ్యర్థించారు. అలాగే చెక్‌ పాయింట్ల వద్ద వాహనాన్ని తనిఖీ చేస్తామన్నారు.

అన్ని చర్యలు తీసుకుంటాం 

ఇదిలాఉండగా.. జనవరి 22 (సోమవారం) అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం ఉన్నప్పుడు పలు సంఘ విద్రోహ శక్తుల నుంచి అనేక బెదిరింపులు వచ్చాయి. కానీ అక్కడ పోలీసుల భారీ భద్రత వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. అయితే రిపబ్లిక్ వేడుకలు కూడా ప్రశాంత వాతావరణంలో జరిగే దిశగా పోలీసులు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం భారీ భద్రతను మోహరించి.. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Also Read: పార్లమెంట్ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్!

Advertisment
తాజా కథనాలు