Michaung Cyclone: మిచౌంగ్‌ తుఫాన్ ఎఫెక్ట్‌.. తమిళనాడులో 12 మంది మృతి

తమిళనాడులోని చెన్నై, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో 12 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. వరదల్లో చిక్కుకొని, భవనాలు కూలిపోయి, చెట్లు విరిగిపడి, వీళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అక్కడ పలు ప్రాంతాలు వరద నీటిలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

New Update
Michaung Cyclone: మిచౌంగ్‌ తుఫాన్ ఎఫెక్ట్‌.. తమిళనాడులో 12 మంది మృతి

Cyclone Michaung Highlights : మిచౌంగ్ తుఫాను Cyclone Michaung ప్రభావంతో తమిళనాడు (Tamil Nadu)లోని చెన్నై నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వరదల కారణంగా 12 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. వరదల్లో చిక్కుకోని, భవనం కూలిపోయి, చెట్లు విరిగిపడి, కరెంట్‌ షాక్‌కు గురై వీళ్లు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు చెన్నైతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో భారీ వర్షం నమోదైంది. ఇప్పటికీ అక్కడ చాలా ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. అలాగే వరద బాధిత ప్రాంతాల్లో తమిళనాడు సీఎం పర్యటించి వారి పరిస్థితిని గురించి తెలుసుకున్నారు.

Also Read: ఆ పదవికి రాజీనామా చేయనున్న రేవంత్ రెడ్డి..!

ఇదిలాఉండగా.. బాలివుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌ (Ameer Khan) కూడా అదే ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్నారు. దీంతో సహాయక బృందం ఆయన్ని కాపాడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపుతూ.. అమిర్‌ఖాన్‌తో కలిసి బోటులో ఉన్న ఫొటోను నటుడు విష్ణువిశాల్ ఎక్స్‌ (ట్వి్ట్టర్‌)లో పోస్టు చేశారు. అయితే అమిర్‌ఖాన్ తన తల్లికి వైద్య చికిత్స కోసం కొన్ని నెలల క్రితం చెన్నైలో ఇల్లు తీసుకొని అక్కడ ఉంటున్నారని తెలుస్తోంది.

Also Read: మాంచి ఊపుమీదున్న బాలయ్య.. ఒకేసారి ముగ్గురు భామలతో రొమాన్స్!

Advertisment
Advertisment
తాజా కథనాలు