Maoist : పోలీసులకు లొంగిపోయిన 12 మంది మావోయిస్టులు

జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్‌ జిల్లాలో సుమారు 12 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తలపై రూ.కోటి రివార్డ్‌ ఉన్న మావోయిస్ట్‌ మిసిర్‌ బెస్రా బృందానికి చెందినవారు లొంగిపోయినట్లు పోలీస్ అధికారి పేర్కొన్నారు.

New Update
Maoist: పోలీసు వాహనంపై మావోయిస్టుల బాంబు దాడి..

Jharkhand : లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్న నేపథ్యంలో.. మావోయిస్టులు(Maoists), పోలీసుల(Police) మధ్య కాల్పులు జరుగుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. అయితే జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్‌ జిల్లాలో సుమారు 12 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆ తర్వాత తమ ఆయుధాలను సరెండర్‌ చేశారు. తలపై రూ.కోటి రివార్డ్‌ ఉన్న మావోయిస్ట్‌ మిసిర్‌ బెస్రా బృందానికి చెందినవారు లొంగిపోయినట్లు పోలీస్ అధికారి పేర్కొన్నారు.

Also Read: టాప్‌ యంగ్‌ గేమర్స్‌తో కలిసి గేమ్స్ ఆడిన ప్రధాని మోదీ..

ఆసియా(Asia) లోనే అత్యంత దట్టమైన అటవి ప్రాంతాలైన సరందా, కోల్హాన్‌లో మావోయిస్టులు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన 12 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయినట్లు సీనియర్ పోలీస్ అధికారి గురువారం వెల్లడించారు. అయితే మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న జార్ఖండ్‌లో సింగ్‌భూమ్‌ లోక్‌సభ స్థానంలో మే 13న పోలింగ్ జరగనుంది. దాదాపు పదేళ్ల పాటు ఓటింగ్‌(Voting) కు దూరంగా ఉన్న ప్రాంతాల ప్రజలు మొదటిసారి ఓటు వేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల బృందాలు, పోలింగ్ సామగ్రిని హెలికాప్టర్‌ల ద్వారా ఆయా ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధం అయ్యారు.

ఇదిలాఉండగా.. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీల నేతలు ఎన్నికల రంగలోకి దిగిపోయారు. ఓవైపు మూడోసారి అధికారంలోకి రావాలని ఎన్డీఏ.. మరోవైపు మోదీ సర్కార్‌ను గద్దె దింపాలని ఇండియా కూటమిలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి దేశ ప్రజలు ఎవరికి అధికారం అప్పగిస్తారో తెలియాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.

Also Read: లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ హంతకుడి కొడుకు పోటీ..

Advertisment
Advertisment
తాజా కథనాలు