Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న ఓ ప్రైవేటు బస్సును ముందు నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీర్థయాత్రకు వెళ్తున్న 11 మంది భక్తులు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

New Update
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

UP Bus Accident - 11 Dead and 10 Injured: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న ఓ ప్రైవేటు బస్సును ముందు నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. షాజహాన్‌పూర్‌లోని ఖుతార్ ప్రాంతంలో గోలా - లఖింపూర్ రహదారిపై శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఇక వివారాల్లోకి వెళ్తే.. రహదారి పక్కన దాబా వద్ద ఓ ప్రైవేటు బస్సు ఆగి ఉంది. ఆ రోడ్డుపై వేగంగా వస్తున్న ఓ లారీ ముందు నుంచి బస్సును ఢీకొంది. బస్సుపై లారీ దూసుకెళ్లడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read: ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు శిశువులు మృతి

మరోవైపు షాజహాన్‌పూర్ ఎస్పీ షోక్ కుమార్‌ మీనా మాట్లాడుతూ.. శనివారం 11 గంటలకు ఖుతార్ పీఎస్‌ పరిధిలో బస్సు ఆగి ఉందని తెలిపారు. పూర్ణగిరికి వెళ్లే భక్తులు బస్సులో ఉన్నారని.. మరికొందరు భక్తులు దాబాలో భోజనం చేస్తున్నట్లు తెలిపారు. ట్రర్రు అదుపు తప్పి బస్సుపైకి దూసుకెళ్లడంతో 11 మంది భక్తులు మృతి చెందారని తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read: లోక్‌సభ ఐదు దశల్లో ఎంత మంది ఓటు వేశారంటే..

Advertisment
తాజా కథనాలు