Bangladesh : భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నం.. 11 మంది బంగ్లాదేశీయులు అరెస్టు

భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన 11 మంది బంగ్లాదేశీయులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పలువురు బంగ్లాదేశీయులు భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించగా బీఎస్‌ఎఫ్ అధికారులు అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

New Update
Bangladesh : భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నం.. 11 మంది బంగ్లాదేశీయులు అరెస్టు

BSF : బంగ్లాదేశ్‌ (Bangladesh) లో చెలరేగిన అల్లర్లు ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. దీంతో అక్కడ జరుగుతున్న దాడులకు భయపడి చాలామంది ఆశ్రయం కోసం భారత సరిహద్దుకు వస్తున్నారు. దీంతో అప్రమత్తమైన సరిహద్దు భద్రతా దళం (BSF).. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. భారత్‌ (India) లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన 11 మంది బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది.

Also Read: బంగ్లాదేశ్ లాంటి సవాళ్లను ఎదుర్కోవడంలో దృఢంగా భారత్

పశ్చిమ బెంగాల్‌ (West Bengal) లో ఇద్దరు, త్రిపురలో ఇద్దరు అలాగే మేఘాలయా సరిహద్దులో ఏడుగురు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని.. ఆ తర్వాత పోలీసులకు అప్పగిస్తామని పేర్కొంది. ఇదిలాఉండగా.. భారత సరిహద్దుకు పలువురు బంగ్లాదేశీయులు చేరుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. వాళ్లు భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది వాళ్లని అడ్డుకున్నారు. ఎందుకు అనుమతించడం లేదో ఓ అధికారి వాళ్లకు బెంగాలీలో వివరించారు.

Also Read: త్వరలోనే బంగ్లాదేశ్‌కు వస్తున్నా.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

' ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిస్థితుల గురించి అందరికీ తెలుసు. మేము మిమ్మల్ని భారత్‌లోకి వచ్చేందుకు పర్మిషన్ ఇవ్వాలనుకున్నప్పటికీ ఆ పనిని చేయలేం. ఇలాంటి సమస్యల పరిష్కారానికి చర్చలు అవసరం. వెంటనే ఈ సమస్య పరిష్కారమవ్వడం సాధ్యం కాదు. దయచేసి తిరిగి వెళ్లిపోండి' అంటూ ఆయన బంగ్లాదేశీయులకు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.


Advertisment
Advertisment
తాజా కథనాలు