asian games:కాంపౌండ్ ఆర్చరీలో భారత మహిళలకు గోల్డ్ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. తమ మీద పెట్టుకున్న అంచనాలకు మించి రాణిస్తున్నారు అథ్లెట్లు. కొత్తగా ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ వెన్నమ్, ఓ జూస్ డియోటాలే బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే నిన్న పదోరోజు మొత్తంలో భారత్ కు తొమ్మిది పతకాలు వచ్చాయి. అందులో రెండు స్వర్ణాలు కూడా ఉన్నాయి. By Manogna alamuru 04 Oct 2023 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి భారత అథ్లెట్లు దుమ్ముదులుపుతున్నారు. ప్రతీరోజు పతకాల వేట కొనసాగిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ డబుల్స్‌లో అమ్మాయిలు స్వర్ణాన్ని సొంతం చేసుకున్నారు. కొరియా జంటను 158-159 పాయింట్లతో భారత జంట జ్యోతి సురేఖ వెన్నమ్, ఓ జూస్ డియోటాలే లు ఓడించారు. అలాగే నిన్న భారత మహిళా జావెలిన్ త్రోయర్ అన్ను రాణి ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శన కనబర్చింది. చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అన్ను రాణి అదిరిపోయే త్రో విసిరి పసిడి పతకం చేజిక్కించుకుంది. ఈ సీజన్ లోనే తన బెస్ట్ త్రో నమోదు చేసిన అన్ను రాణి జావెలిన్ ను 62.92 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం అందుకుంది. అన్ను రాణి తన నాలుగో ప్రయత్నంలో ఈ సూపర్ త్రో విసిరింది. భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ పారుల్ చౌదరి 5000 మీటర్ల పరుగులో భారత్ కు స్వర్ణం అందించింది. 28 ఏళ్ల పారుల్ చౌదరి 15:14:75 నిమిషాల టైమింగ్ తో రేసులో అగ్రస్థానంలో నిలిచింది. జపాన్ అథ్లెట్ హిరోనకాదే మొదటి స్థానం అనుకున్నారు కానీ...పారుల్ అనూహ్యంగా పుంజుకుని స్వర్ణాన్ని మెడలో వేసుకుంది. పదోరోజు భారత్ ఖాతాలోని బంగారు పతకాల సంఖ్య 16కి పెరిగింది. ఓవరాల్ గా 69 పతకాలతో ఆసియా క్రీడల్లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆతిథ్య చైనా, జపాన్, దక్షిణ కొరియా వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. పురుషుల 800 మీటర్ల విభాగంలో మొహమ్మద్ అఫ్జల్ సిల్ర్ ను గెలుచుకున్నాడు. అఫ్జల్‌కు ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. 48.43 సెకెన్లలో రేసు ముగించాడు ఈ కేరళ అథ్లెట్. ఇక పురుషుల ట్రిపుల్ జంప్ లో ప్రవీణ్ చిత్రావెట్ భారత్‌కు కాంస్యాన్ని అందించాడు. తమిళనాడుకు చెందిన ప్రవీణ్ 16.68 మీటర్ల దూరం దూకాడు. మరోవైపు పది క్రీడాంశాలు(100 మీటర్లు, లాంగ్ జంప్, షాట్ పుట్, హై జంప్, 400 మీటర్లు,110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్ వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్లు) డెక్లాథాన్లో ఇండియాకు రజత పతకం లభించింది. 49 ఏళ్ళ తర్వాత భారత్ కు ఇందులో పతకం వచ్చింది. ఢిల్లీకి చెందిన తేజిస్విన్ శంకర్ 7666 పాయింట్లతో కొత్త జాతీయ రికార్డ్ నెలకొల్పాడు. 1974లో ఇండియాకు చివరిసారిగా ఆసియా క్రీడల్లో విజయ్ సింగ్ చౌహాన్ స్వర్ణం, సురేశ్ బాబు కాంస్యం గెలిచారు. వీటితో పాటూ భారత్ కు బాక్సింగ్ లో రెండు కాంస్యాలు, కనోయింగ్ లో ఒక బ్రాంజ్ వచ్చాయి. మరోవైపు పురుషుల జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా ఫైనల్ కు దూసుకెళ్ళాడు. అలాగే బ్యాడ్మింటన్ లో పి.వి.సింధు, హెచ్.ఎస్.ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ లు ప్రీ క్వార్టర్స్ లోకి ఎంటర్ అయ్యారు. మహిళల హాకీలో కూడా భారత జట్టు సెమీ ఫైనల్స్ కు దూసుకెళ్ళింది. ఈరోజు నీరజ్ చోప్రా, బాక్సింగ్ లో లవ్లీనా బంగారు పతకాల కోసం పోటీ పడనున్నారు. దీంతో పాటూ 3000 మీటర్ల స్టీపుల్ ఛేంజ్ లో స్వర్ణం సాధించిన అవినాష్ సాబ్లే కూడా 5000 మీటర్ల బరిలోకి దిగనున్నారు. #sports #gold #asian-games #medals #athletes #india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి