Zomato : కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంచిన జొమాటో

ప్రముఖ ఫుడ్ డెలవరీ సంస్థ జోమాటో బాదుడుకు సిద్ధమైంది. ఇకపై తమ దగ్గర ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఛార్జీలు ఎక్కువే చెల్లించాలి అంటోంది. కొంతకాలం క్రితం జొమాటో ప్రవేశపెట్టిన ప్లాట్ ఫాం ఫీజును ఇప్పుడు మరింత పెంచేస్తోంది.

Zomato: శాకాహారం ఆర్డర్‌ ఇస్తే..మాంసాహారం..క్షమాపణలు చెప్పిన జొమాటో!
New Update

Food Order Charges Are Getting High : ప్రస్తుతం ఫుడ్ డెలవరీ యాప్స్(Food Delivery Apps), సంస్థలకు భలే గిరాకీ ఉంది. కోవిడ్(Covid) తరువాత నుంచి ఇది మరింత పెరిగిపోయింది. నిజం చెప్పాలంటే ఇళ్ళల్లో ఆహారం వండుకోవడం తక్కువ ఆర్డర్ పెట్టుకోవడం ఎక్కువ అయినట్టుంది పరిస్థితి. ముఖ్యంగా స్విగ్గీ(Swiggy), జొమాటో(Zomato) లకు అయితే విపరీతమైన డిమాండ్ , క్రేజ్ ఉంది. జీఎస్టీలు, డెలివరీ ఫీజు, ప్లాట్ ఫాం ఫీజు ఇలా ఎనని పెట్టినా వీటి క్రేజీ మాత్రం తగ్గడం లేదు. మెట్రో నగరాల్లో ఈ డిమాండ్ ఇంకా కాస్త ఎక్కువే ఉంది. అయితే ఈ క్రేజ్‌కు తగ్గట్టే ఫుడ్ డెలివరీ సంస్థలు చార్జీలు కూడా పెంచేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా జొమాటో మరోసారి ఛార్జీలను పెంచి వినియోగదారులకు షాక్ ఇస్తోంది.

ప్లాట్ ఫాం ఫీజు పెరిగింది...

కొంతకాలం క్రితమే స్విగ్గీ, జొమాటోలు ప్లాట్ ఫాం ఫీజును ప్రవేశపెట్టాయి. జీఎస్టీల్లాంటివి కాకుండా ఇది అదనపు ఫీజు. ఇప్పుడు దీన్నే మళ్ళీ పెంచుతోంది జొమాటో. అది కూడా ఏకంగా 25శాతం. ఏప్రిల్ 20 నుంచి ఇది అమలు అవుతుంది. దీన్ని బట్టి ఒక ఆర్డర్‌పై ప్లాట్‌ఫాం ఫీజు రూ. 5 వసూలు చేయనున్నట్లు వెల్లడించింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, లక్నో ల్లాంటి ప్రధాన నగరాల్లో ఈ ప్లాట్‌ఫాం ఫీజు పెంచుతున్నామని చెబుతోంది. అంతకుముందు ఇదే ఏడాది మొదట్లో అంటే జనవరిలో జొమాటో ప్లాట్‌ఫాం ఫీజును రూ. 3 నుంచి 4 కు పెంచిన సంగతి తెలిసిందే. మొదటిసారిగా జొమాటో ఈ ఫుడ్ ఫ్లాట్ ఫాం ఛార్జీని ఆగస్టు 2023 నుంచి వసూలు చేయడం ప్రారంభించింది. మొదట్లో ఈ ఛార్జీలు 2 రూ.లు ఉండేవి. తరువాత దీన్ని 3 నుంచి 4 రూ.లకు పెంచింది. ఇప్పుడు అది కాస్తా 5 రూ. అయింది. మరోవైపు ఇక జొమాటోకు చెందిన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాం బ్లింకిట్.. ఆర్డర్‌పై రూ. 2 ప్లాట్‌ఫాం ఫీజు వసూలు చేస్తోంది.

ఫుడ్ డెలివరీకి ఉన్న డిమాండ్‌ను స్విగ్గీ, జొమాటోలు తెగ యూజ్ చేసుకుంటు్నాయి. ఎంత ఛార్జీలు పెంచినా కస్టమర్ల తగ్గకపోవడంతో ఛార్జీలను యధేచ్ఛగా పెంచేస్తున్నాయి. అయితే మరోవైపు కస్టమర్లను ఆకర్షించుకునేందుకు ఈ సంస్థలు.. కొత్త కొత్త ప్రోగ్రామ్స్ కూడా లాంఛ్ చేస్తున్నాయి. కొన్నేమో డెలివరీ ఛార్జీల్ని ఎత్తేస్తుండగా.. ఇంకొన్ని డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ప్రతీ ఆర్డ్ మీదా ఏదో ఒక ఆఫర్ పెడుతున్నాయి.

Also Read:Viral Video: ముద్దుగా చిన్న పిల్లల్లా మారిపోయిన దేశాధినేతలు..వీడియో వైరల్

#orders #zomato #food-delivery #charges
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe