Zomato: మోకాలి లోతు నీటిలో ఫుడ్‌ డెలివరీ చేసిన జొమాటో బాయ్‌

మోకాలి లోతు నీటిలో జొమాటో డెలివరీ ఏజెంట్‌ ఒకరు ఫుడ్‌ ని డెలివరీ చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. దీంతో ఆ డెలివరీ బాయ్‌ మీద ప్రశంసలు కురుస్తున్నాయి. ఆయనకు జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్ అతనికి రివార్డ్‌ ఇవ్వాలని కోరుతున్నారు.

Zomato: మోకాలి లోతు నీటిలో ఫుడ్‌ డెలివరీ చేసిన జొమాటో బాయ్‌
New Update

Zomato: మోకాలి లోతు నీటిలో కూడా ఫుడ్‌ ఆర్డర్‌ ను డెలివరీ చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు జొమాటో డెలివరీ ఏజెంట్‌. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జొమాటో ఏజెంట్‌ తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. దీనిని చూసిన సోషల్‌ మీడియా వినియోగదారులంతా కూడా అతని అంకితభావం, సంకల్పానికి జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్ అతనికి రివార్డ్‌ ఇవ్వాలని కోరుతుననారు.

పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ కూడా..తన కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు అతను ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మరి ఫుడ్‌ ఆర్డర్‌ ని డెలివరీ చేశాడు.

జొమాటో డెలివరీ ఏజెంట్ వీడియో వైరల్ కావడంతో ఈ పోస్ట్‌పై జోమాటో స్పందించింది. ఈ వీడియోను X వినియోగదారు అయిన నీతూ ఖండేల్‌వాల్ అనే వ్యక్తి షేర్‌ చేసి... ఇలా అన్నాడు: "ఈ కష్టపడి పనిచేసే డెలివరీ వ్యక్తి ఎవరో తెలుసుకుని అతని అంకితభావానికి సంకల్పానికి తగిన విధంగా అతనికి రివార్డ్‌ ఇవ్వాలని నేను @deepigoyalని అభ్యర్థిస్తున్నాను." అంటూ సోషల్‌ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు.

ఈ వీడియో Zomato ఏజెంట్ పునరుద్ధరణ చర్య అతని విధి పట్ల అతని అంకితభావాన్ని నొక్కిచెప్పడమే కాకుండా ప్రతికూల వాతావరణ పరిస్థితులలో డెలివరీ సిబ్బంది తరచుగా విస్మరించే సవాళ్లను కూడా హైలైట్ చేసింది. అయితే గుజరాత్‌లో ఇటువంటి విపరీతమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆర్డర్లు ఇస్తున్నారని పలువురు వినియోగదారులు విమర్శించారు. డెలివరీ సిబ్బంది జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నందున, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో "జొమాటో ఆర్డర్ చేయడాన్ని నిలిపివేయాలి" అని చాలా మంది చెప్పారు.

Also Read: ఆర్మీ ఛాపర్‌ నుంచి జారిపడ్డ హెలికాఫ్టర్‌!

#rains #gujarat #zomato #delivery-boy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe