భారత జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇద్దరూ తరచూ ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తూ కనిపిస్తుంటారు. ప్రముఖ డ్యాన్సర్ ధనశ్రీ ఇటీవల ఓ డ్యాన్స్ రియాల్టీ షోలో పాల్గొంది
. ఈ సమయంలో, ఆమె తన కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్‌తో కలిసి సోషల్ మీడియాలో ఒక చిత్రాన్ని పోస్ట్ చేసింది.
దాని కారణంగా ఆమె ట్రోలింగ్‌ను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటి వారిని టార్గెట్ చేస్తూ ధనశ్రీ ధీటుగా సమాధానం ఇచ్చింది. మీ తల్లి, సోదరి కూడా మహిళలే అని గుర్తు పెట్టుకోండి... అందుకే స్త్రీలను గౌరవించండి అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
ట్రోలర్లపై ధనశ్రీ వర్మ ఆగ్రహం
స్టార్ క్రికెటర్ చాహెల్ భార్య తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె ట్రోలర్ల పై ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది. ట్రోల్స్ కారణంగా తన కుటుంబం ప్రభావితమైందని, అందుకే సోషల్ మీడియాకు కొంతకాలం విరామం ఇస్తున్నానని ధనశ్రీ తెలిపింది. ధనశ్రీ మాట్లాడుతూ, "నా జీవితంలో ఎప్పుడూ ట్రోల్‌లు, మీమ్‌ల బారిన పడలేదు. ఈసారి అది నన్ను, నా కుటుంబాన్ని ప్రభావితం చేసింది అంటూ చెప్పుకొచ్చింది.
'మీ అమ్మ, చెల్లి కూడా మహిళలే..'
ఈ వీడియో ద్వారా, ద్వేషాన్ని వ్యాప్తి చేసే వారు తమ ప్రతిభ, నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. తాను కూడా మీ తల్లి, సోదరి లాంటి మహిళనే అనే విషయాన్ని ట్రోలర్లు గుర్తుంచుకోవాలని ఆమె అన్నారు. ధనశ్రీ మాట్లాడుతూ, "నేను కూడా స్త్రీనే అనే విషయం మీరు మరచిపోవద్దు, మీ సోదరి, తల్లి, స్నేహితురాలు, భార్య అందరూ స్త్రీలే, అలాంటి పరిస్థితిలో ఇలా ట్రోల్ చేయడం సరికాదని హితవు పలికింది.
Also read: చికెన్ ప్రియులకు గుడ్‌న్యూస్..భారీగా తగ్గిన ధరలు!