Sharmila Fires On CM KCR: ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీపై ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఓటమే టార్గెట్ గా ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం మూడో సారి ముచ్చటగా సీఎం కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యేలా ప్రతిపక్షాలు వ్యూహించని కార్యాచరణ చేస్తూ ప్రచారంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.
ALSO READ: కాంగ్రెస్ లోకి విజయశాంతి.. కారణం ఇదే!
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రం ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా ఉండేలా కార్యాచరణ చేపట్టారు. ఈ పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. తెలంగాణ ప్రజలు వదిలిన బాణంగా.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను తెలుసుకునేందుకు షర్మిల గతంలో పాదయాత్ర కూడా చేశారు.
తాజాగా షర్మిల సీఎం కేసీఆర్ పై ట్విట్టర్(X) వేదికగా ప్రశ్నల దాడి చేశారు. షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో.. "కేసీఆర్ మానస పుత్రిక ధరణి తప్పుల తడకని ఆయన ఎన్నికల అఫిడవిట్ చూస్తేనే అర్థమైతుంది. స్వయానా ముఖ్యమంత్రికి గుంట భూమి ఎక్కువొచ్చిందంటే ఇక సామాన్యుల సంగతి దేవుడెరుగు. ఉన్నోళ్లకు లేనట్టుగా, లేనోళ్లకు ఉన్నట్టుగా, సర్వే నెంబర్ల దాకా మార్చి చూపించే మాయాజాలమే ధరణి. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చినట్లు రాష్ట్రంల ఏ ఊరు చూసినా ధరణి గోసలే. తహశీల్దార్ దగ్గర నుంచి కోర్టుల దాకా ధరణి బాధలే. రైతుల భూములను గుంజుకొని, కోర్టుల చుట్టూ తిప్పుతూ, ధరణే దైర్యం అని చెప్పడానికి దొరకు ఆయన బందిపోట్లకు సిగ్గుండాలే. భూ వివాదాల కోసం కాదు..ముమ్మాటికి దొర భూ దోపిడీ కోసమే తెచ్చుకున్న పథకం. బందిపోట్ల ఆస్తుల్ని పెంచడానికి అమలు చేసిన పథకం. ధరణి తిప్పలు తప్పాల్నంటే దొర నియంత పాలనను బొంద పెట్టుడు ఒక్కటే మార్గం. ఈ ఎన్నికల్ల కారుకు కర్రు కాల్చి వాత పెట్టుడు ఒక్కటే పరిష్కారం." అని రాసుకొచ్చారు.
ALSO READ: తెలంగాణలో మోదీ పర్యటన.. అందుకేనా?