ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తాజాగా వైఎస్‌ఆర్ జిల్లాలో లింగాలలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ సంఘటన జరిగిన అనంతరం వైఎస్ షర్మిల దీనిపై స్పందించారు. ' అవినాష్ రెడ్డికి ఓడిపోతాననే భయం పట్టుకుంది. అందుకే నన్ను అడ్డుకుంటున్నారు.
Also read: ప్రధాని మోదీ పాలనపై ప్రజల అభిప్రాయాన్ని వెల్లడించిన లోక్‌నీతి సర్వే..
అల్లర్లు చేసేవారు పులివెందులకు రండి. పూల అంగళ్ల వద్ద పంచాయితీ పెడదాం. వివేకాను ఎవరు హత్య చేశారో తేల్చుకుందాం అంటూ' షర్మిల వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా.. మరికొన్ని రోజుల్లో ఏపీలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయారు. మే 13న ఏపీలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4 న కౌంటింగ్ ఉంటుంది. అయితే ఈసారి ఏపీ ప్రజలు ఎవరికి అధికారం అప్పగిస్తారనేది ఆసక్తిగా మారింది.
Also read: గుంటూరులో వైసీపీకి షాక్.. కీలక నేత రాజీనామా