ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే టికెట్లు ఎవరెవరికి దక్కుతాయానే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వం తమ పార్టీకి చెందిన మొదటి, రెండవ విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలను విడుదల చేసింది. మూడో జాబితాను కూడా త్వరలోనే ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో.. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్, మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది ఆ పార్టీ.
Also Read: నేను ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయను: లగడపాటి రాజగోపాల్
ఇప్పటికే ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి తెలుగుదేశం పార్టీలో చేరి.. ఆ పార్టీ కార్యక్రమాల్లో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైసీపీ సర్కార్ స్పీకర్‌ను కోరింది. అలాగే ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్‌లపై సైతం అనర్హత వేటు వేయాలని మండలి ఛైర్మన్‌కు ఎమ్మెల్సీలు మేరుగ మురళి, లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీ సి.రామ చంద్రయ్య టీడీపీలో చేరగా.. జనసేనలో చేరిన వంశీ క్రిష్ణ యాదవ్ చేరారు.
Also read: అయ్యన్నకు బిగ్ షాక్.. తమ్ముడిని బరిలోకి దింపుతున్న వైసీపీ..?