Andhra Pradesh: జగన్‌ ఫర్నిచర్ దొంగ అంటూ టీడీపీ విమర్శ.. కౌంటర్ ఇచ్చిన వైసీపీ

మాజీ సీఎం జగన్‌ను ఫర్నిచర్ దొంగా అంటూ ఎక్స్‌ వేదికగా టీడీపీ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టు వైరలవ్వడంతో దీనిపై తాజాగా వైసీపీ పార్టీ ఎక్స్ వేదికగా స్పందించింది. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాసిన లేఖను పోస్టు చేసింది.

Andhra Pradesh: జగన్‌ ఫర్నిచర్ దొంగ అంటూ టీడీపీ విమర్శ.. కౌంటర్ ఇచ్చిన వైసీపీ
New Update

YCP Counter To TDP On Furniture Issue: మాజీ సీఎం జగన్‌ను (YS Jagan) ఫర్నిచర్ దొంగా అంటూ ఎక్స్‌ వేదికగా టీడీపీ విమర్శించిన సంగతి తెలిసిందే. తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని సచివాలయ ఫర్నిచర్‌తో నింపి.. అధికారం ఊడాక ఫర్నిచర్‌ను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదంటూ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పోస్టు వైరలవ్వడంతో దీనిపై తాజాగా వైసీపీ పార్టీ ఎక్స్ వేదికగా స్పందించింది. జగన్‌ మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకొని వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డం టీడీపీ అలవాటుగా మార్చుకుందంటూ కౌంటర్‌ ఇచ్చింది. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి (YCP MLC Lella Appireddy) రాసిన లేఖను పోస్టు చేసింది.

Also Read: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. త్వరలోనే ఆ ఉద్యోగ నోటిఫికేషన్!

'నిస్సిగ్గుగా, నీతిమాలిన రాజకీయం చేస్తున్న టీడీపీ తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మంచి సేవలు అందించే అవకాశాన్ని కూటమికి ప్రజలు అప్పగిస్తే, అధికారం చేపట్టాక వారి ప్రవర్తన, వ్యవహరిస్తున్న తీరు రోజురోజుకీ దిగజారుతోంది. వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డం ఒక అలవాటుగా టీడీపీ మార్చుకుంది.

ముఖ్యమంత్రి హోదాలో శ్రీ వైయస్ జగన్ గారి క్యాంపు కార్యాలయంలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఉన్నా.. వారి క్యాంపు కార్యాలయాలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణ విషయం. ప్రభుత్వం మారాక ఏయే వస్తువులను క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారో జాబితాను అధికారులకు ఇప్పటికే సమర్పించడం జరిగింది. వెసులుబాటు ఇస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌కు విలువకట్టి, ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే, అంతా చెల్లిస్తామని ప్రభుత్వాధికారులను కోరడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయితే టీడీపీ మంత్రులు, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా శ్రీ వైయస్ జగన్ గారిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దుష్ప్రచారం రాజకీయాల్లో అత్యంత దిగజారుడుతనాన్ని సూచిస్తున్నాయి. తప్పుడు ప్రచారాలతో శ్రీ వైయస్ జగన్ ‌గారి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయలేరని తెలియజేసుకుంటున్నాను' అని లెల్లఅప్పిరెడ్డి రాసుకొచ్చారు.

Also Read: త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ – సీఎం చంద్రబాబు నాయుడు

#telugu-news #tdp #ysrcp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe