YS Sharmila : కడప రాజకీయాల్లో సంచలనం.. షర్మిలతో సునీత భేటీ. ఏపీ రాజకీయాలు మంచి రసవత్తరంగా మారుతున్నాయి. ఒకవైపు టీడీపీ, జనసేన మరో వైపు వైసీపీ, కాంగ్రెస్ లతో...రోజుకో ట్విస్ట్‌తో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అన్నాచెల్లెళ్ళ మధ్య వార్ ముదురుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏపీ పీసీసీ ఛీఫ్ షర్మిలతో వివేకా కూతురు సునీత భేటీ హాట్ టాపిక్‌గా మారింది. By Manogna alamuru 29 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Kadapa Politics : ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెళ్ళు. కానీ రాజకీయంగా బద్ధ వైరులు. అన్న వైఎస్ జగన్(YS Jagan) ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అయితే చెల్లెలు షర్మిల(YS Sharmila) ఏపీ పీసీసీ ఛీఫ్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. మళ్ళీ వీటిల్లో రోజుకో ట్విస్ట్. ఇదీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో పొలిటికల్ గేమ్. వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy) తమ్ముడు వివేకానంద రెడ్డి(Vivekananda Reddy) కూతురు సునీత ఏపీ పీసీసీ షర్మిలను కలవబోతున్నారు. ఇడుపులపాయ గెస్ట్ హౌజ్(Idupulapaya Guest House) లో షర్మిలతో సునీత చర్చలు చేయనున్నారు. షర్మిలతో భేటీ అనంతరం కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని కూడా సమాచారం. దీంతో ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. Also Read : Chandra Babu:చంద్రబాబు బెయిల్ పిటిషన్ మీద సుప్రీంలో నేడు విచారణ సునీత పొలిటికల్ ఎంట్రీ.. గత కొన్ని రోజులుగా వివేకా కూతురు సునీత రాజకీయాల్లోకి వస్తారని ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు షర్మిల, సునీతల భేటీ...ఈ ఊహాగానాలకు దన్నగా నిలుస్తున్నాయి. సునీత(Sunitha) పొలిటికల్ ఎంట్రీపై షర్మిలతో భేటీలో కీలక నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి షర్మిలతో వైఎస్ వివేకా కుమార్తె సునీత కలుస్తున్నారు. వివేకా హత్య కేసు నేపథ్యంలో సీఎం జగన్‌తో సునీతకు దూరం పెరిగింది. మరోవైపు తండ్రి హత్యపై న్యాయ పోరాటంలోనూ సునీతకు షర్మిల అండగా నిలిచారు. దీంతో భేటీ తర్వాత ఎలాంటి ప్రకటన చేస్తారోనని అందరిలోనూ ఉత్కంఠత పెరిగింది. ఇక షర్మిల, సునీతల భేటీ తర్వాత ఇడుపులపాయ నుంచిఇద్దరూ కలిసి కడపకు రానున్నారు. కడపలో కాంగ్రెస్ శ్రేణులతో షర్మిల విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఆ తర్వాత ఖాజీపేటలో మాజీమంత్రి డీఎల్‌తో షర్మిల సమావేశం అవనున్నారు. షర్మిల, ఆళ్ళ చర్చలు... మరోవైపు ఇడుపులపాయలో ఈమధ్యనే వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలను కలిశారు. భవిష్యత్తు కార్యాచరణ గురించి వీరిద్దరూ చర్చించుకున్నారని తెలుస్తోంది. వైసీపీ నుంచి బయటకు వచ్చిన రామకృష్ణా రెడ్డి ఇక మీదట షర్మిలతోనే ఉంటానని...ఆమె ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచే చేస్తానని చెప్పారు. Also Read : ఆ మంత్రే మాపై రాళ్ల దాడి చేయించాడు: కన్నా లక్ష్మీనారాయణ #andhra-pradesh #sunitha #kadapa #ys-sharmila మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి