YS Sharmila : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పదవీ బాధ్యతల స్వీకరణ షెడ్యూల్ ఇదే.!

ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల ఈ నెల 21న విజయవాడలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ముందుగానే వైఎస్ మరణాంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న సీనియర్ నేతలతో ఫోన్ లో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో కడప రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

New Update
YS Sharmila : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పదవీ బాధ్యతల స్వీకరణ షెడ్యూల్ ఇదే.!

Also Read: నిశ్చితార్థానికి వచ్చిన జగన్.. లైట్ తీసుకున్న షర్మిల

పీసీసీ చీఫ్ పదవితో ఏపీ(AP) లో యాక్టివ్ అవుతున్నారు వైఎస్ షర్మిల. భవిష్యత్ కార్యాచరణకు కడప నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో, రానున్న రోజుల్లో కడప రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందుగానే సీనియర్ నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ మరణాంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలతో ఫోన్ లో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: వీడిన వికారాబాద్ మర్డర్ మిస్టరీ..వెలుగులోకి సంచలన విషయాలు

కడప జిల్లాలో సైలెంట్ గా ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించే దిశగా అడుగులు వేస్తున్నారు. సీనియర్ల సహకారం, సూచనలు ఎంతో అవసరమని భావిస్తున్నారు షర్మిల. వైఎస్ వారసురాలిగా రాజకీయాల్లో సహకారం అందిస్తామని సీనియర్ నేతలు భరోసా ఇచ్చినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక నేరుగా కలిసి మద్దతు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు