CM Jagan: నిశ్చితార్థానికి వచ్చిన జగన్.. లైట్ తీసుకున్న షర్మిల

షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థానికి సీఎం జగన్ ఆయన సతీమణి భారతి తో కలిసి వచ్చారు. షర్మిలను, అనిల్ ను జగన్ పిలవగా వారు రాలేదు. దీంతో బొకే ఇచ్చి వెనక్కి తిరిగి వెళ్లారు జగన్ దంపతులు.

New Update
CM Jagan: నిశ్చితార్థానికి వచ్చిన జగన్.. లైట్ తీసుకున్న షర్మిల

CM Jagan Attends Sharmila Son Engagement: కాంగ్రెస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం ఈరోజు జరుగుతోంది. ఈ వేడుకకు షర్మిల సోదరుడు సీఎం జగన్ ఆయన సతీమణి భారతి తో కలిసి వచ్చారు. విజయమ్మను దగ్గరి తీసుకొని అలుముకున్నారు. తన మేనల్లుడు రాజారెడ్డికి విషెస్ తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి ఫొటో దిగి వెళ్లారు. సీఎం జగన్ వెంట సజ్జల రామకృష్ణ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.. అలాగే వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. గత కొన్ని రోజులుగా వివిధ కారణాలతో దూరంగా ఉన్న సీఎం జగన్, షర్మిల ఈరోజు ఒకే దగ్గర కలుసుకోవడంతి వైఎస్ అభిమానులకు ఆనందం ఆకాశాన్ని తాకింది.

publive-imagepublive-imagepublive-imagepublive-image

అన్నా వదినలను లైట్ తీసుకున్న షర్మిల

వైఎస్ కుటుంబంలో మరోసారి విభేదాలు బయట పడ్డాయి. గండిపేటలో జరుగుతున్న షర్మిల కొడుకు రాజారెడ్డి నిశ్చితార్థానికి హాజరైన సీఎం జగన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఫోటో దిగేందుకు షర్మిలను, అనిల్ ను జగన్ రమ్మనగా వారు రాలేదు. సీఎం జగన్ ను వారుపట్టించు కోనట్లే ఉన్నారు. ఫోటో దిగిన అనంతరం విజయమ్మను హద్దుకున్న సీఎం జగన్, భార్య భారతి.. తన మేనల్లుడు రాజారెడ్డికి పూల బొకే ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

SHARMILA SON ENGAGEMENT LIVE:

Advertisment
Advertisment
తాజా కథనాలు