/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/sharmila-1-1-jpg.webp)
YS Sharmila Tweet Viral in Social Media : వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila), అనిల్ కుమార్ దంపతుల కొడుకు రాజారెడ్డి, కూతురు అంజలి రెడ్డి తమ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల తన సంతోషాన్ని సోషల్ మీడియా(Social Media) ద్వారా పంచుకున్నారు. తన పిల్లలు చదువులో మైలు రాళ్లను అధిగమించడం చాలా గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.
Also read: 20 ఏళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న.. ప్రధాని మోడీ
Thrilled to announce the academic milestones of both my incredible children! 🎓✨ Heartiest congratulations to my son Raja Reddy on achieving a Master of Science degree in Applied Economics and Predictive Analytics and my daughter Anjili Reddy for earning a BBA Finance degree.… pic.twitter.com/hBRpD2w2Dz
— YS Sharmila (@realyssharmila) December 20, 2023
ఎకనామిక్స్ , ప్రిడిక్టివ్ అనలిటిక్స్ లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని సాధించినందుకు కుమారుడు రాజారెడ్డికి, బీబీఏ ఫైనాన్స్ డిగ్రీని సంపాదించినందుకు కుమార్తె అంజలి రెడ్డికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మీరు చాలా త్వరగా ఉన్నతస్థానాలకు ఎదిగారని..మీ ఇద్దరి గురించి చెప్పడం చాలా మనసుకు ఆనందంగా ఉందని అన్నారు.
సత్యాన్ని అన్వేషిస్తూ..సమగ్రతతో కూడి జీవితాన్ని గడపాలని ఇద్దరికీ సూచించారు. సాటి మనుషుల పట్ల ఆదరణతో ఉంటూ.. మీరు ఎదగడమే కాకుండా, మీ చుట్టూ ఉన్నవారికి కూడా విలువ ఇస్తూ... వారిని కూడా ఎదిగేలా చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు షర్మిల తన బిడ్డలతో కలిసున్న ఫొటోలను పంచుకున్నారు. ఈ ఫొటోల్లో షర్మిల, ఆమె భర్త అనిల్, విజయమ్మ ఉన్నారు.