Mumbai Indians: కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తొలగింపు రకరకాల మలుపులు తిరుగుతోంది. తాజాగా మరో ఊహాగానం సోషల్ మీడియాలో బయటా చక్కర్లు కొడుతోంది. హార్ధిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల అప్పగింత ఆ జట్టు మెంటార్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కు కూడా అంగీకార యోగ్యం కాదన్నది ఆ చర్చల సారాంశం.
🚨Breaking News🚨
Sachin Tendulkar stepped down from mentor role of Mumbai Indians.
RIP MUMBAI INDIANS pic.twitter.com/qKq17TQF60
— Shubham 𝕏 (@DankShubhum) December 16, 2023
కెప్టెన్సీ మార్పు చర్య సచిన్‌కు నచ్చలేదని, అందుకే అతడు మెంటార్ పదవి నుంచి తప్పుకున్నాడని సోషల్ మీడియా వేదికగా బాగా ప్రచారం జరుగుతోంది. అయితే, చివరికి ఇవన్నీ ఫేక్ న్యూస్‌లే అని తెలిసింది. రోహిత్ శర్మను కెప్టెన్‌గా తప్పించడంపై అసంతృప్తితో ఉన్న ఫ్యాన్స్ ఎవరో ఇలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. రోహిత్ ఫ్యాన్స్ ఇలాంటి ఫేక్ న్యూస్ బాగా స్ప్రెడ్ చేస్తున్నారని ముంబై ఇండియన్స్ వర్గాలు చెప్పాయి.
Sachin Tendulkar is still the mentor of Mumbai Indians.
- The news circulating in social media is fake. pic.twitter.com/aelZssqsGw
— Johns. (@CricCrazyJohns) December 17, 2023
సచిన్ మెంటార్‌గానే ఉన్నాడు
సచిన్ మెంటార్ పదవి నుంచి తప్పుకున్నాడనేది నిజం కాదని, ఇంకా ఆ స్థానంలో మాస్టర్ బ్లాస్టర్ కొనసాగుతున్నాడని ముంబై ఇండియన్స్ చెప్తోంది. ఆ ఫ్రాంచైజీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా మెంటార్‌గా సచిన్ పేరే ఉంది. దీనిపై ముంబై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.