తెలంగాణలో 80 శాతం కాంట్రాక్టులు మెఘాకే.. వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు..

కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిల. 'నేను తినను.. ఇంకొకరిని తిననివ్వను అన్న మోదీకి ఇప్పుడు ఏమైంది. కేసీఆర్ మొత్తం తింటూనే ఉన్నారు.. మోదీ చూస్తేనే ఉన్నారు.. మరి ఏం చేస్తున్నారు మీరు' అంటూ ప్రదాని మోదీని ప్రశ్నించారు షర్మిల.

YS Sharmila: నేడు కాంగ్రెస్ లోకి షర్మిల.. హైకమాండ్ కు ఆమె పెట్టిన కండిషన్లు ఇవే!
New Update

YS Sharmila Allegations on Kaleshwaram Project: తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. జస్ట్ 1.50 లక్షల ఎకరాలకు సాగునీటి కోసం 1.20 లక్షల కోట్లు ఖర్చు చేశారని, ప్రాజెక్టు పేరుతో ఈ సొమ్మునంతా సీఎం కేసీఆర్, ప్రాజెక్టు నిర్మించిన కాంట్రాక్టర్లే తినేశారని అన్నారు. జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న వైఎస్ షర్మిల.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఎలా జరిగింది? సీఎం కేసీఆర్, ప్రాజెక్టును నిర్మించిన మెఘా ఇంజనీరింగ్ సంస్థ ఎలా అవినీతికి పాల్పడిందనే విషయంపై సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై సీఎం కేసీఆర్, మెఘా కృష్ణా రెడ్డిని విచారించాలని అన్నారు.

డిబేట్‌లో వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ యధావిధంగా..

'కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. దీని అసలు ప్రాజెక్టును వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఆ ప్రాజెక్టు పేరు అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు. రూ. 38 వేల కోట్ల అంచనాతో దీని రూపకల్పన చేశారు. 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో దీనిని డిజైన్ చేశారు. అప్పటిఏ రూ. 7 వేల కోట్లు ఖర్చు చేశారు ఆ ప్రాజెక్టు మీద. ఆ తరువాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. తనకు తానే ఇంజనీర్‌గా ప్రకటించుకుని.. కాళేశ్వరం పేరుతో మొత్తం ప్రాజెక్టు స్వరూపాన్నే మార్చేశారు. ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 1.20 లక్షల కోట్లకు పెంచారు. దీని సాగునీటి సామర్థ్యం 18 లక్షల ఎకరాలు మాత్రమే. అంటే పాత డిజైన్ కంటే.. కొత్త డిజైన్‌తో 2 లక్షల ఎకరాలకు అధికంగా సాగునీరు అందుతుందన్నమాట. ఈ 2 లక్షల ఎకరాల కోసం.. ఏకంగా 1.20 లక్షల కోట్ల వ్యయాన్ని పెంచారు. చివరకు ఏమైంది.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రకటించారు. అంటే 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్.. 1.20 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఆయన చెప్పింది 18 లక్షల ఎకరాలు అయితే.. వాస్తవానికి మాత్రం 1.50 లక్షల ఎకరాలు మాత్రమే సాగు అవుతోంది.' అని క్లియర్‌గా వివరించారు వైఎస్ షర్మిల.

కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు..

'గతేడాది వరదలు వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పంప్ హౌస్ మొత్తం మునిగిపోయింది. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయి కూలిపోయే స్థితికి చేరింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కూడా ఇటీవల వచ్చి పరిశీలించారు. ఆ డ్యామ్ ఇక వినియోగానికి పనికిరాదు అని రిపోర్ట్ ఇచ్చారు. ప్రాజెక్టు డిజైన్, మెయింటెనెన్స్ అంతా తప్పుల తడకగా ఉందని, ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఉందని రిపోర్ట్ ఇచ్చారు. ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టిన 1.20 లక్షల కోట్లు కేసీఆర్, కంట్రాక్టర్లు నొక్కేశారు. తెలంగాణలోని 80 శాతం కాంట్రాక్టులు, అన్ని పనులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ వర్క్స్, ఇరిగేషన్ వర్క్స్, స్ట్రీల్ లైట్స్ మార్చాలన్నా, స్కూల్ వర్క్స్ కోసమైనా.. ప్రతీది మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా కంపెనీకే కట్టబెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మెఘా కృష్ణా రెడ్డిని విచారించాల్సిందే. దేశంలోనే ఇది అతిపెద్ద స్కామ్. ఇది దేశ సంపద. ఈ స్కామ్ గురించి బీజేపీ ప్రభుత్వానికి తెలుసు. చాలా మంది బీజేపీ కేంద్ర మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక ఆరోపణలు చేశారు. అయినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఏం చెప్పారు? ఏం చేస్తున్నారు?' అని కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు వైఎస్ షర్మిల.

ప్రధాని మోదీపై మాస్ సెటైర్..

'నేను తినను.. ఇంకొకరిని తిననివ్వను అన్న మోదీకి ఇప్పుడు ఏమైంది. ఇక్కడ బిందాస్‌గా ఉన్నారు. కేసీఆర్ మొత్తం తింటూనే ఉన్నారు.. మోదీ చూస్తేనే ఉన్నారు.. మరి ఏం చేస్తున్నారు మీరు' అంటూ ప్రధాని మోదీపై తనదైన శైలిలో పంచ్‌లు వేశారు వైఎస్ షర్మిల.

రాజకీయ భవిష్యత్‌పై క్లారిటీ..

ఎన్నికల బరి నుంచి తప్పుకుని.. రాజకీయాలకు దూరమవుతున్నారా? అని డిబేట్‌లో యాంకర్ వేసిన ప్రశ్నకు వైఎస్ షర్మిల ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ బిడ్డగా.. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతానని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. బీఆర్ఎస్‌పై పోరాడుతున్నామన్నారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ కూడా ప్రజల కోసం పని చేయకపోతే.. ఆ పార్టీపైనా పోరాడుతామని స్పష్టం చేశారు షర్మిల.

'ఈ నిర్ణయం ఎంతమాత్రం నా పొలిటికల్ కెరీర్‌కు ముగింపు కాదు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. ప్రధాని మోదీ అనేక సందర్భాల్లో నేను చౌకీదార్ అని చెబుతున్నారు. కానీ, మోదీలోని చౌకీదార్‌కు ఏమైందో తెలియడం లేదు. తెలంగాణలో చాలా అవినీతి జరుగుతోంది. మోదీలోని చౌకీదార్‌ను నిద్రలేపాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, దౌర్జన్య పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. తెలంగాణలోనే ఉంటా.. తెలంగాణ ప్రజల కోసమే పోరాడుతా.' అని తన పొలిటికల్ కెరీర్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు వైఎస్ షర్మిల.

Also Read:

అలా చేస్తే నా నిర్ణయం నేను తీసుకుంటా: హైకమాండ్ కు జగ్గారెడ్డి ఫోన్

ఒకవేళ హంగ్ వస్తే తెలంగాణ లో పరిస్థితి ఏంటి? పార్టీల ప్లాన్ బీ ఎలా ఉంటుంది?

#telangana #ys-sharmila #ysrtp #telangana-politics #kaleshwaram-poject
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe