AP Politics:కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా వైఎస్ షర్మిల?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల వస్తారన్న వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత సీఎం జగన్ కు చెక్ పెట్టాలంటే షర్మిల రావాల్సిందేనని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. స్టార్ క్యాంపెనర్గా షర్మిల సేవలను వినియోగించుకోవాలని ఏఐసీసీ నిర్ణయించినట్టు సమాచారం.

New Update
AP Politics:కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా వైఎస్ షర్మిల?

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి షర్మిల రావాల్సిందేనని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నట్టు చెబుతున్నారు. ఏఐసీసీ కీలక సమావేశంలో ముక్తకంఠంతో అధిష్టానానికి ఇప్పటికే నేతలు తమ నిర్ణయాన్ని చెప్పారని అంటున్నారు. ఈ నేపథ్యంలో వస్తున్న వార్తల ప్రకారం అతి త్వరలో షర్మిలతో కాంగ్రెస్ అధిష్టానం సమావేశం కానుందని తెలుస్తోంది. స్టార్ క్యాంపెనర్గా షర్మిల సేవలను వినియోగించుకోవాలని ఏఐసీసీ నిర్ణయించినట్టు అంతర్గత సమాచారం. మరోవైపు ఈసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టిడిపి, జనసేనతో కలిసి ముందుకు వెళ్లేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆసక్తి చూపిస్తోందని తెలుస్తోంది.

Also read:మార్కెట్లోకి త్వరలోనే భారత్ రైస్

ఇక షర్మిల తో సంప్రదింపులు జరిపేందుకు డీకే శివకుమార్ ని రంగంలోకి దింపాలని అదిష్టానం అనుకుంటోంది. అంతకుముందు షర్మిలకు కర్ణాటక కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సీటు ఇస్తామనిచెప్పారు. కానీ డీకే జోక్యంతో ఆమె ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ముందు నిరాకరించినా...డీకే ఒప్పించడంతో షర్మిల ఆంధ్రాకు వెళ్ళడానికి ఒప్పుకున్నారు. అందుకే ఇప్పుడు మళ్ళీ డీకే ద్వారానే ఆమెతో సంప్రదింపులు జరపాలని అధిష్టానం అనుకుంటోంది. దీంతో పాటూ త్వరలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా రాహుల్ లు కూడా షర్మిలతో భేటీ కానున్నారు.

Advertisment
తాజా కథనాలు