BREAKING: ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిలకు కీలక పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 16 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Congress AP Chief YS Sharmila: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరిన వైఎస్ షర్మిలకు కీలక పదవిని కట్టబెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ప్రత్యేక ఆహ్వానితుడుగా గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల తన కర్తవ్యాలను నిర్వహించనుంది. ALSO READ: స్కిల్ స్కామ్ కేసులో ఊహించని ట్విస్ట్.. క్వాష్ పిటిషన్ సీజేఐకి బదిలీ.. గిడుగు రుద్రరాజు రాజీనామా.. ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు నిన్న (సోమవారం) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు (Mallikarjun Kharge) అందజేశారు. తెలంగాణ ఎన్నికలే కారణం? తెలంగాణలో YSR పేరుతో పార్టీ పెట్టిన షర్మిల (YS Sharmila) ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. అందరు షర్మిల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని అనుకోగా .. షర్మిల మాత్రం కాంగ్రెస్ వైపే మొగ్గుచూపింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను గద్దె దించేందుకే తాము ఎన్నికల్లో పోటీ చేయట్లేదని.. తాము పోటీ చేయడం ద్వారా ఓట్లు చీలి మరోసారి కేసీఆర్ సీఎం అవుతారనే కోణంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాం అని షర్మిల అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో షర్మిలకు కాంగ్రెస్ ఆడిస్తాం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. అదే.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అద్యక్ష పదవిని కేటాయించింది. ఏపీలో కాంగ్రెస్ గాలి లేకపోవడం షర్మిల చేరికతో వేవ్ వస్తుందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు ఈ పదవిని ఇచ్చింది. మరి అధ్యక్ష పదవికి వచ్చిన షర్మిల ఆంధ్ర ప్రదేశ్ లో కానరాకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకుపోతుందో మునుముందు చూడాల్సి ఉంది. #ys-sharmila #cm-jagan #sharmila #congress-party #ap-latest-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి