Crime News: ఎత్తైన బిల్డింగ్ పై నుంచి దూకి యూట్యూబర్ జంట సూసైడ్..!

ఎత్తైన బిల్డింగ్ పై నుంచి దూకి యూట్యూబర్ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పై నుంచి దూకడంతో వారు మరణించారు. షూటింగ్ సమయంలో జరిగిన గోడవ నేపథ్యంలో సహజీవనం చేస్తున్న ఈ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది.

New Update
Crime News: ఎత్తైన బిల్డింగ్ పై నుంచి దూకి యూట్యూబర్ జంట సూసైడ్..!

Crime News:  దేశ రాజధాని ఢిల్లీలో శివారు ప్రాంతమైన హర్యానాలోని బహదూర్ గఢ్ లో యూట్యూబర్ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఎత్తైన భవనం పై నుంచి దూకడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. షూటింగ్ సమయంలో జరిగిన గొడవ కారణంగా సహజీవనం చేస్తున్న ఈ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 25ఏళ్ల గర్విట్, 22ఏళ్ల నందిని కలిసి యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తున్నారు.యూట్యూబ్ , ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ కోసం షార్ట్ ఫీల్మ్స్ రూపొందిస్తున్నారు.

వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. తమ టీమ్ తో కలిసి నందిని డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి 20కిలోమీటర్ల దూరంలోని బహదూర్ గఢ్ కు చేరుకున్నారు. రుహీలా రెసిడెన్సీలోని 7వ అంతస్తులో ఒక ఫ్లాట్ ను రెంట్ కు తీసుకున్నారు. ఐదుగురు సహచరులతో కలిసి అందులో నివసిస్తున్నారు. అయితే శనివారం ఉదయం 6గంటల సమయంలో గర్విట్, నందిని కలిసి భవనం ఏడో అంతస్తు పై నుంచి కిందికి దూపకారు. తీవ్ర గాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గర్విట్, నందిని డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. షూటిం్గ తర్వాత గత రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన ఈ జంట మధ్య గొడవ జరిగిందని..దీంతో ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిర్ధారణ కోసం ఆధారాలు సేకరించడంతోపాటు ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: ధర తక్కువ..ఫీచర్లు ఎక్కువ..ఇన్ ఫినిక్స్ నోట్40 ప్రో సిరీస్ ఫోన్లు వచ్చేసాయ్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు