ప్రతిఒక్కరి చేతిలోకి సెల్‌ఫోన్ వచ్చాక ఒక్కరోజు కూడా ఫోన్ వాడకుండా ఎవరూ ఉండలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, యూట్యూబ్‌లలో గంటల పాటు సమయాన్ని గడుపుతున్నారు. ప్రతిరోజూ కనిపించే వీడియోలు, రీల్స్‌లలో కొన్ని ఉపయోగకరంగా ఉంటే మరికొన్ని ఫేక్ వీడియోలు కూడా దర్శనమిస్తాయి. ఇటీవల సెలబ్రిటీలు, పలువురు ప్రముఖుల డీప్‌ఫేక్ వీడియోలు వైరల్‌గా మారడం దుమారం రేపిన సంగతి తెలిసిందే.
Also Read: మూడో ప్రపంచ యుద్ధంపై హెచ్చరించిన చాట్ జీపీటీ..
ప్రముఖుల ఫేక్ వీడియోలు
అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో కొందరు కేటుగాళ్లు ఇలా తయారుచేస్తున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ యూజర్లను తప్పుదోవ పట్టించేలా ఉండే మోసపూరిత ప్రకటనల వీడియోలను తొలగించేసింది. సెలబ్రిటీలపై వస్తున్న ఫేక్ వీడియోలపై 404 మీడియా పరిశోధన చేసింది. అయితే అందులో ప్రముఖ సింగర్ టైలర్ స్విఫ్ట్, నటుడు స్టీవ్ హార్వే మరికొందరు ప్రముఖుల వీడియోలు కనిపించాయి.
పాలసీకి వ్యతిరేకం
ఏఐని వినియోగిస్తూ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న ప్రకటనలకు సంబంధించి.. వెయ్యికి పైగా ఫేక్ యాడ్‌లను యూట్యూబ్ తీసేసింది. ఈ డీప్‌ఫేక్ వీడియోలను ఇప్పటిదాక 200 మిలియన్ల మంది చూశారు. ఇలా అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాంకేతికతను వినియోగించి.. కొందరు దుండగులు ఇలా తయారు చేస్తున్న ఫేక్ వీడియోలపై యూట్యూబ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో వస్తున్న కంటెంట్ తమ పాలసీకి వ్యతిరేకంగా ఉందని.. అందుకే వీటిపై చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.
Also Read: దేశంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసా.. ?