Lok Sabha Elections: దేశంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసా.. ? రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 96 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గణంకాలు చెబుతున్నాయి. వీళ్లలో 47 కోట్ల మంది మహిళలే ఉన్నారు. అలాగే ఓటు వేసేందుకు అర్హులైన వారిలో 1.73 కోట్ల మంది 18 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్నవారేనని తెలుస్తోంది. By B Aravind 27 Jan 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి దేశంలో లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికల ప్రచారాల వ్యూహాలకు పదును పెడుతున్నారు. మూడోసారి అధికారంలోకి రావాలని ఓ వైపు బీజేపీ పార్టీ పట్టుదలతో ఉండగా.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ.. ఇండియా కూటమితో కలిసి బీజేపీని గద్దె దించాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారనే అంశంపై ఓ కీలక సమాచారం బయటపడింది. Also Read: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్.. మొరార్జీ దేశాయ్ తరువాత ఆమే! 1.73 కోట్ల మంది 18 - 19 ఏళ్ల వారే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 96 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులని కేంద్ర ఎన్నికల సంఘం గణంకాలు చెబుతున్నాయి. అయితే వీళ్లలో 47 కోట్ల మంది మహిళలే ఉన్నారు. అలాగే ఓటు వేసేందుకు అర్హులైన వారిలో 1.73 కోట్ల మంది 18 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్నవారేనని తెలుస్తోంది. అయితే లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా 12 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2019లో 67 శాతం పోలింగ్ అలాగే దాదాపు 1.5 కోట్ల మంది పోలింగ్ సిబ్బందిని నియమించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. అయితే గతేడాది రాజకీయ పార్టీలకు ఎన్నికల ఓ లేఖ పంపింది. దాని ప్రకారం చూసుకుంటే.. భారత్‌లో స్వాతంత్ర్య్ం వచ్చాక 1951లో మొదటిసారిగా ఎన్నికల జరిగాయి. అప్పుడు 17.31 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2019 నాటికి ఓటర్ల సంఖ్య ఏకంగా 91.20 కోట్లకు చేరుకుంది. మొదటిసారి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్ నమోదైంది. అయితే 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 67 శాతం పోలింగ్ నమోదైంది. మరి 2024 లో జరగనున్న ఎన్నికల్లో ఈసారి ఎంత నమోదవుతోందో వేచి చూడాలి. Also Read: ‘వీళ్లతో పెట్టుకోకండి’.. ప్రపంచ దేశాలకు ఆనంద్ మహీంద్ర హెచ్చరిక.. #telugu-news #election-commission-of-india #2024-lok-sabha-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి