Scooters Theft For Insta Reels: ఇప్పుడు జనాలకు కొత్త పిచ్చి ఇన్స్టాగ్రామ్. దీనిలో రీల్స్ చేయడానికి, వ్యూస్ పెంచుకోవడానికి తెగ ఆరాటపడుతున్నారు. ముఖ్యంగా యువత దీని మోజులో పిచ్చెక్కిపోతున్నారు. హైదరాబాద్లో ఇద్దరు యువకులు ఇన్ట్సారీల్స్ పిచ్చిలో పడి ఏకంగా స్కూటర్లను దొంగతనం చేశారు. 19 ఏళ్ల షేక్ ఇబ్రహీం అతని స్నేహితుడు మరో 17 ఏళ్ళ అబ్బాయి కలిసి ఈ పనిని చేశారు. ముందు స్కూటర్లను దొంగతనం చేయడం…ఆ తరువాత వాటి నేమ్ ప్లేట్స్ పీకేసి వాటి మీద విన్యాసాలు చేస్తూ రీల్స్ చేయడం…ఇదీ ఈ ఫ్రెండ్స్ చేసే పని. దీని కోసం ఇద్దరూ కలిసి ఆరు హోండా డియో స్కూటర్లను దొంగతనం చేశారు. అది కూడా హైదరాబాద్ నగర శివార్లలో షాహీన్ నగర్లో ఇవన్నీ చేశారు.
పూర్తిగా చదవండి..Hyderabad: ఇన్స్టా రీల్స్ కోసం స్కూటర్ల దొంగతనం
సోషల్ మీడియా పిచ్చి ఎక్కువైపోతోంది జనాల్లో. దీనికి ఈ మధ్య కాలంలో బోలెడు ఉదాహరణలు కనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లో ఇద్దరు యువకులు దీన్ని మళ్ళీ నిరూపించారు. ఏం చేశారో తెలియాలంటే...ఇది చదివేయండి.
Translate this News: