Hyderabad: ఇన్స్టా రీల్స్ కోసం స్కూటర్ల దొంగతనం

సోషల్ మీడియా పిచ్చి ఎక్కువైపోతోంది జనాల్లో. దీనికి ఈ మధ్య కాలంలో బోలెడు ఉదాహరణలు కనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఇద్దరు యువకులు దీన్ని మళ్ళీ నిరూపించారు. ఏం చేశారో తెలియాలంటే...ఇది చదివేయండి.

New Update
Hyderabad: ఇన్స్టా రీల్స్ కోసం స్కూటర్ల దొంగతనం

Scooters Theft For Insta Reels: ఇప్పుడు జనాలకు కొత్త పిచ్చి ఇన్స్టాగ్రామ్. దీనిలో రీల్స్ చేయడానికి, వ్యూస్ పెంచుకోవడానికి తెగ ఆరాటపడుతున్నారు. ముఖ్యంగా యువత దీని మోజులో పిచ్చెక్కిపోతున్నారు. హైదరాబాద్‌లో ఇద్దరు యువకులు ఇన్ట్సారీల్స్ పిచ్చిలో పడి ఏకంగా స్కూటర్లను దొంగతనం చేశారు. 19 ఏళ్ల షేక్ ఇబ్రహీం అతని స్నేహితుడు మరో 17 ఏళ్ళ అబ్బాయి కలిసి ఈ పనిని చేశారు. ముందు స్కూటర్లను దొంగతనం చేయడం...ఆ తరువాత వాటి నేమ్ ప్లేట్స్ పీకేసి వాటి మీద విన్యాసాలు చేస్తూ రీల్స్ చేయడం...ఇదీ ఈ ఫ్రెండ్స్ చేసే పని. దీని కోసం ఇద్దరూ కలిసి ఆరు హోండా డియో స్కూటర్లను దొంగతనం చేశారు. అది కూడా హైదరాబాద్ నగర శివార్లలో షాహీన్‌ నగర్‌లో ఇవన్నీ చేశారు.

అయితే వీరి దొంగతనాలు ఎక్కువ కాలం సాగలేదు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు వీరిని తొందరగానే పట్టుకున్నారు.ఏప్రిల్ 13న చోరీకి గురైన బైక్ తాలూకా సీసీ టీవీ ఫుటేజ్ ఆధారాలు లభించడంతో పోలీసులకు క్లూ దొరికింది. దీంతో దర్యాప్తు ప్రారంభించారు. దాంతో పాటూ రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్ లేని వాహనాల మీద నిఘా ఉంచారు. అది కూడా షాహీన్‌లో నగర్‌లోనే ఒక బృందాన్ని నియమించారు. కరెక్ట్‌గా ఇద్దరు స్నేహితులు అక్కడే నంబర్ ప్లేట్ లేని బైక్‌తో దొరికారు. తీగ లాగితే డొంకంతా కదిలింది. స్నేహితుల వ్యవహారం అంతా బయటపడింది. ఇంకేముందీ బేగం పేట పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి, దొంగిలించిన బైక్‌లను రికవరీ చేశారు.

Also Read:Gujarat: పండుగ వేళ విషాదం.. 10 మంది మృతి!

Advertisment
తాజా కథనాలు