Viral Video: కారులోనే కుకింగ్‌.. ఏకంగా KFC చేసిన యువతి

ఓ యువతి కదిలే కారులో వంట చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో సోఫీ సల్దానా అనే హ్యాండిల్‌లో షేర్‌ చేశారు. పోస్ట్‌కి కారులో వేయించిన చికెన్ అంటూ క్యాప్షన్‌ పెట్టారు. ఈ వీడియో చూడాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Viral Video: కారులోనే కుకింగ్‌.. ఏకంగా KFC చేసిన యువతి
New Update

Viral Video: భోజన ప్రియులు ఎక్కువగా వంటగదిలో తమకు ఇష్టమైన ఆహారం తయారు చేసుకుని లేదా తయారు చేయించుకుని తింటుంటారు. స్ట్రీట్‌ ఫుడ్స్‌, ఫుడ్‌ ట్రక్స్‌పై వంటలను చూసి ఉంటాం. కానీ ఓ యువతి ఏకంగా కదిలే కారులో వంట చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అదీ ఇదీ కాదు ఏకంగా చికెన్‌ కేఎఫ్‌సీనే చేసేసింది. ఓ యువతి కారు రన్నింగ్‌లో ఉండగా ఎలక్ట్రిక్ వంట పాత్రలను ఉపయోగించి చికెన్‌ను వండింది. అంతేకాకుండా చాలా నీట్‌గా వంట చేసిందంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మామూలుగా వంట చేస్తేనే ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది కదులుతున్న కారులో వంట చేయడం అంటే ఆశామాషీ కాదంటున్నారు.

publive-image

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సోఫీ సల్దానా అనే హ్యాండిల్‌లో షేర్‌ చేశారు. అంతేకాకుండా పోస్ట్‌కి కారులో వేయించిన చికెన్ అంటూ క్యాప్షన్‌ పెట్టారు. ఇప్పటివరకు ఈ వీడియోను 46 వేల మంది వీక్షించారు. దీనిపై పలువురు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

publive-image

వామ్మో ఇలాంటి ఉడికీ ఉడకనిది తింటే పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తుంటే.. మరికొందరు ఈమెతో రెస్టారెంట్‌ ఓపెన్‌ చేయిస్తే దారి పొడవునా వచ్చిపోయేవారికి వడ్డించవచ్చంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇంత ఇబ్బంది పడేబదులు ఇంటి దగ్గర చక్కగా వండుకొని తెచ్చుకోవచ్చు కదా తల్లీ అంటూ నెటిజెన్లు సలహా ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఇంటి ముందుకు వచ్చిన ఆవుకు ఇలా చేస్తే ఎంతో పుణ్యం

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

#cooking #viral-video #kfc #woman
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe