Asafoetida Benefits: హైబీపి వేధిస్తుందా..? ఇంగువతో ఈ వ్యాధులు పోతాయని తెలుసా..?

హైబీపి నుంచి ఉపశమనం లభించాలంటే ఇంగువ రోజూ తినాలి. ఆడవారిలో పీరియడ్స్ కడుపు నొప్పిని నయం చేయటంలో ఇంగువ అద్భతంగా పని చేస్తుంది. తలనొప్పిని తగ్గించి, ఉబ్బసం సమస్యలును ఇంగువ దూరం చేస్తుంది.

Asafoetida Benefits: హైబీపి వేధిస్తుందా..? ఇంగువతో ఈ వ్యాధులు పోతాయని తెలుసా..?
New Update

వంటల్లో చాలామంది ఇంగువని వాడుతూ ఉంటారు. మన పెద్దల కాలం నుంచి అనేక వంటల్లో ఇంగువని వేస్తూనే ఉంటారు. అయితే రోజూ ఇంగువని తినటం వలన అద్భుతమైన ప్రయోజనం ఉన్నాయి. సాధారణంగా ఇంగువను చాలా తక్కువ మంది ఇళ్లల్లో ఉపయోగిస్తుంటారు. కానీ.. ఎప్పటి నుంచో ఇంగువా చాలా రకాల హోం రెమెడీస్‌లో వాడేవారు. ముఖ్యంగా కడుపు సమస్యలు ఉన్నవారికి ఇది దివ్యౌషధం అని చెప్పాలి. అంతేకాదు.. అధిక రక్తపోటును తగ్గించడానికి ఇంగువా అద్భుతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో అధిక రక్తపోటు సమస్య అనేది ప్రతిఒక్కరిని ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ రక్తపోటు వేధిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగువ బెస్ట్‌ మెడిసిన్‌గా ఉపయోగపడుతుంది. అధిక రక్తపోటు ఉన్న రోగులకు ఇంగువ ఎలా మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: గుడ్డు- ఆమ్లెట్ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదంటే..?

అధిక రక్తపోటు ఉన్న రోగులు తేనెతో కలిపిన పొడి ఇంగువా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేస్తే ఆస్తమా, శ్వాస సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అధిక BP ఉంటే ఇది నియంత్రణలో ఉంచుతుంది. యాంటీ వైరల్, కార్మినేటివ్, యాంటీ బాక్టీరియల్, ఇన్ఫ్లమేటరీ, ఉపశమనంతోపాటు మూత్రవిసర్జన లక్షణాలు, జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులను దూరం చేయటంలో ఇంగువా చాలా ఉపయోగపడుతోందని వైద్యు అంటున్నారు. అంతేకాకుండా .. ఇంగువను ఉపయోగించేందుకు ఉత్తమమైన, సులభమైన మార్గం రోజువారీ ఆహారంలో తీసుకోవటం. దీని కోసం ఇంట్లో తయారు చేసిన పప్పులు, కూరగాయలలో ఇంగువాను వేస్తే ఆహారం రుచిని పెంచి BPని అదుపులో ఉంచుతుంది. శరీరంలో రక్తం మందంగా తయారు కాకుండా రక్తాన్ని పలచగా చేసేందుకు ఇంగువ బాగా పనిచేస్తుంది. దీని వల్ల మన శరీరంలో రక్తపోటు బాలన్స్‌గా ఉండి సమస్యలు దగ్గరకు రాకుండా ఉంటాయి.

ఇంగువ అద్భతంగా పని చేస్తుంది

ఇంకా చెప్పాలంటే..ఆడవారిలో పీరియడ్స్ కడుపు నొప్పిని నయం చేయటంలో ఇంగువ అద్భతంగా పని చేస్తుంది. తలనొప్పిని తగ్గించి, ఉబ్బసం నుంచి ఉపశమనం ఇస్తుంది. గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా పొడి ఇంగువ, చిటికెడు సైంధవ లవణం, చిటికెడు అల్లం కలిపి తింటే కడుపునొప్పి, హైబీపీ వాతం, గ్యాస్‌ సమస్య పోయి కడుపునొప్పిని వెంటనే తగ్గుతుంది. ఇంగువాను మజ్జిగ లేదా గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే మంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

#tips #health-benefits #asafoetida #high-bp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe