International Yoga Day 2024: ఈరోజు (శుక్రవారం) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో యోగా (Yoga) వేడుకలు నిర్వహించారు. పార్కులు, పాఠశాలలు తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తూ యోగా గురించి అవగాహన కల్పించారు. న్యూయార్క్ (New York) లోని టైమ్స్ స్క్వేర్‌లో ఒకేసారి వేలాది మంది ఆసనాలు వేయడం చూపరులను ఆకట్టుకుంది. ఇక ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో కూడా వందలాది మంది యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాదు ఇందులో పాల్గొన్నవారు యోగా చేసే మ్యాట్‌లకు బందీల చిత్రాలను అతికించారు. వారు సురక్షితంగా స్వదేశానికి రావాలంటూ డిమాండ్ చేస్తూ మౌన నిరసన చేశారు.
Also Read: దేశవ్యాప్తంగా 157 యూనివర్సిటీల్లో లోపాలు.. యూజీసీ సంచలన ప్రకటన
అటు ఇజ్రాయెల్ (Israel) లోని భారత రాయబార కార్యలయంలో కూడా యోగా వేడుకలు జరిగాయి. ఇందులో దాదాపు 300 మందికి పైగా పాల్గొన్నారు. ఐర్లాండ్‌లోని భారత రాయబార కార్యలయంలో ఈ వేడుకలు నిర్వహించారు. చైనాలోని షాంఘైలో లింగ్షాన్ బుద్ధుని వద్ద యోగా కార్యక్రమాలు నిర్వహించారు. నేపాల్‌లో భారత రాయబార కార్యాలయం అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లలో యోగా సెషన్‌లు నిర్వహించింది. మరోవైపు ఆస్ట్రేలియా (Australia) లోని మెల్‌బోర్న్‌లో కూడా యోగా వేడుకలు నిర్వహించారు.