Wagner Group Chief Died : వాగ్నర్ గ్రూప్ చీఫ్ మృతి? రష్యా‎లో ప్లేన్ క్రాష్.. అసలేం జరిగింది.?

రష్యాలో పుతిన్ పై తిరుగుబాటు చేసిన ప్రైవేట్ ఆర్మీ వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ మరణించారా? పలు అంతర్జాతీయ వార్త సంస్థలు ఇదే వార్తను ప్రసారం చేస్తున్నాయి.రష్యాలో బుధవారం ఓ ప్రైవేట్ విమానం కూలిపోయింది. విమాన ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు సమాచారం. అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థ TASS ఈ సమాచారాన్ని ఇచ్చింది. సమాచారం ప్రకారం, ప్రైవేట్ విమానం మాస్కో నుండి సెయింట్ పీటర్స్‌బర్గ్ వెళ్తుండగా కూలిపోయింది. విమానంలో ఉన్న మొత్తం 10 మంది మరణించారని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. పుతిన్‌పై తిరుగుబాటు చేసిన యవ్జెనీ ప్రిగోజిన్ ఈ విమాన ప్రమాదంలో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

Wagner Group Chief Died : వాగ్నర్ గ్రూప్ చీఫ్ మృతి? రష్యా‎లో ప్లేన్ క్రాష్.. అసలేం జరిగింది.?
New Update

Wagner Group Chief prigozhin Died : రష్యాకు చెందిన ప్రైవేట్ ఆర్మీ వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ (prigozhin) విమాన ప్రమాదంలో (Plane crash) మరణించారనే వార్త సంచలనంగా మారింది. అంతర్జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రిగోజిన్ మాస్కో సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది. ఇటీవల రష్యాలో అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు తర్వాత ప్రిగోజిన్ దేశం నుండి బహిష్కరించబడ్డారు. జూన్‌లో పుతిన్‌పై తిరుగుబాటు విఫలమైనప్పటి నుండి వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ హత్యాయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. BBC నివేదిక ప్రకారం, మాస్కో సమీపంలో ఒక విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 10 మంది ప్రయాణికులు మరణించారు. వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ (prigozhin) కూడా వారిలో ఒకరు. గ్రే జోన్, వాగ్నర్ గ్రూప్‌కు అనుబంధంగా ఉన్న టెలిగ్రామ్ ఛానెల్, మాస్కోకు ఉత్తరాన ఉన్న ట్వెర్ ప్రాంతంలో వాయు రక్షణ ద్వారా జెట్‌ను కూల్చివేసినట్లు నివేదించింది.

కూలిపోయిన విమానంలో యెవ్జెనీ ప్రిగోజిన్ (Yevgeny Prigogine)ఉన్నట్లు రష్యా పౌర విమానయాన అథారిటీ ధృవీకరించింది. టాస్ వార్తా సంస్థ ప్రకారం, విమానం భూమిని ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. అదే సమయంలో, స్థానిక ప్రజలకు కూడా పేలుళ్ల శబ్దం వినిపించిందని చెప్పినట్లు సమాచారం.

అయితే ప్రిగోజిన్ విమానం కూలిపోయిందా లేదా అందులో ఏదైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రిగోజిన్ మేలో పుతిన్‌ (Putin)పై తిరుగుబాటు చేశాడు. ఆ తర్వాత విరమించుకుని రష్యా నుండి బెలారస్కులో ఉంటున్నారు. ఆ తర్వాత పుతిన్ తో సయోధ్య కుదిరిందన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ పుతిన్‌పై తిరుగుబాటు చేసిన తరువాత, ప్రిగోజిన్ 4 నెలలు కూడా జీవించలేకపోయాడు. ప్రిగోజిన్ మరణ వార్త యావత్ ప్రపంచాన్ని కలచివేసింది.

పుతిన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తర్వాత, ప్రిగోజిన్ వాగ్నర్ గ్రూప్‌ను దక్షిణాఫ్రికా, బెలారస్, రష్యాలో అత్యంత శక్తివంతమైన శక్తిగా మార్చాలనుకున్నాడు. ప్రిగోజిన్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా కోసం అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని నిర్మించే లక్ష్యంలో ఉన్నాడు. ఇటీవల అతని వీడియో కూడా విడుదలైంది, దీనిలో వాగ్నర్ చీఫ్ దక్షిణాఫ్రికా, రష్యా కోసం పని చేయడం గురించి మాట్లాడాడు. ఇందులో ఆర్మీ యూనిఫాంలో చేతిలో రైఫిల్‌తో ఎడారి ప్రాంతంలో కనిపించాడు. వాగ్నర్ సైన్యం ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉందని ప్రిగోజిన్ చెప్పారు.

#plane-crash #yevgeny-prigozhin #dead #wagner-group-chief-died #russia-ukraine-war #putin
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe