Uttarakhand:ఇవాళ అయినా టన్నెల్ నుంచి కార్మికులు బయటకు వస్తారా? By Manogna alamuru 25 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఉత్తరాఖండ్ లో సొరంగం మూసుకుపోవడంతో 12 రోజులుగా అందులో 41 మంది కార్మికులు చిక్కకుపోయారు. వాళ్ళను బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. లోపల ఉండిపోయిన కార్మికులు ప్రస్తుతానికి బాగానే ఉన్నారు. కానీ వారిని వీలయినంత వెంటనే తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. టన్నెల్ పైన ఉన్న కొండ మీద నుంచి డ్రిల్లింగ్ చేస్తున్నారు. అక్కడ కన్నం పెట్టి దానిలోకి పెద్ద పైపం పంపించడం ద్వారా కార్మికులను బయటకు తీసుకురావాలని ప్లాన్. కానీ దేనితో అయితే సొరంగాన్ని తవ్వుతున్నారో దానికే ప్రాబ్లెమ్ రావడంతో డ్రిల్లింగ్ పనులను ఎక్కడిక్కడే ఆపేశారు. 25 టన్నుల బరువైన భారీ డ్రిల్లింగ్ మెషీన్ అమర్చిన వేదికకు పగుళ్లు రావడంతో డ్రిల్లింగ్‌ను ఆపేశారు. వేదిక సరిగా లేకుంటే డ్రిల్లింగ్ మెషీన్ అటుఇటూ కదులుతూ కచ్చితమైన దిశలో డ్రిల్లింగ్ అవదు. ఎలా పెడితే అలా డ్రిల్లింగ్ చేస్తే అసలుకే మోసమొస్తుంది. అందుకే ముందుజాగ్రత్తగా డ్రిల్లింగ్‌ను ఆపేశారు. Also Read:రాజస్థాన్ లో పోలింగ్ షురూ..సాయంత్రం ఆరు వరకు పోలింగ్ అయితే ఆ డ్రిల్లింగ్ పనులను నిన్న పునరుద్ధరించారు. సాంకేతిక సమస్యలను సరిచేసి డ్రిల్లింగ్ కంటిన్యూ చేశారు. కానీ గంటలోనే మళ్ళీ అంతరాయం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. శిథిలాల మధ్యలో నుంచి టన్నెల్ లోకి స్టీల్ పైపులను పంపించి వాటి గుండా కార్మికులను బయటకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నిన్నటి సమస్యలు ఈరోజు ఎదురు కాకపోవచ్చునని...మిగిలి ఉన్న 5.4 మీటర్ల శిథిలాలు తవ్వేందుకు అవరోధాలు ఎదురుకాకపోవచ్చునని అంటున్నారు. ప్రత్యేక రాడార్ ద్వారా అంతా పరిశీలించామని తెలిపారు. కార్మికులు బయటకు రాగానే పరీక్షలు నిర్వహించి గ్రీన్ కారిడార్ ద్వారా హాస్పట్ల్స్ కు తరలిస్తామని చెప్పారు. Also Read:మాంసాహార ప్రియులకు షాక్..నేడు నాన్ వెజ్ షాపులన్నీ మూసివేయాలని సర్కార్ ఆదేశం..!! #uttarakhand #workers #tunnel #drilling మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి